Milk and honey : పాలలో పుష్కలంగా ఉండే కాల్షియం ఇమ్యూనిటీని పెంచుతుంది. నెయ్యి అనేక విటమిన్ లు కలిగి ఉంటుంది. బ్యుటిరిక్ యాసిడ్, డోకోసాహెక్సానోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు అనేక ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ నెయ్యిలో ఉంటాయి. ఇవి పలు వ్యాధులను దరిచేరకుండా చేస్తాయి. (Milk and honey)
పాలు చాలా ఆరోగ్యకరం. ఇక నెయ్యి కూడా శరీరానికి చాలా మంచిది. వీటిలో క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉండడమే కారణం. అయితే… గ్లాసు పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం పాలలో నెయ్యి కలుపుకుని తాగితే సప్త ధాతువులకు మేలు చేస్తుంది. సప్త ధాతువులు అంటే.. రక్తంలో ప్లాస్మా, రక్తం, కొవ్వు, కండరాలు, ఎముకలు, బోన్ మ్యారో, ప్రత్యుత్పత్తి ద్రవాలు. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ సహా పలు వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.
రోజూ రాత్రి గ్లాసు పాలలో టీ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే… కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల మధ్య లూబ్రికేట్ పెంచడం వల్ల ఈ విధమైన ఉపయోగం ఉంటుంది. కీళ్ల వాపులను కూడా నయం చేస్తుంది. నెయ్యిలోని బ్యుటిరేట్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, పాలలోని కాల్షియం.. నొప్పి, వాపును తగ్గిస్తాయి. పాలలోని కాల్షియంను శరీరం సంగ్రహించేలా నెయ్యిలోని విటమిన్-K2 ఉపయోగపడుతుంది.
జీర్ణ వ్యవస్థకు లాభాలు
గ్లాస్ వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే… జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నెయ్యిలోని బ్యుటిరిక్ యాసిడ్ పేగుల్లో కదలికలకు దోహదపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్, యాసిడ్ రిఫ్లెక్స్, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బలం పెరుగుతుంది
తరచుగా నీరసంగా అనిపిస్తే… పాలలో నెయ్యి కలుపుకుని తాగాలి. తద్వారా స్టామినా పెరిగి.. ఫిజికల్ యాక్టివిటీస్ చురుగ్గా చేసేందుకు దోహదపడుతుంది. శృంగార సామర్థ్యం, వీర్య వృద్ధి కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాలు, నెయ్యి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు, సైనాసైటిస్, సీజనల్ వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. నెయ్యిలోని CLA వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ట్రిప్టోఫాన్ సెరటోనిన్ గా మారుతుంది. సెరటోనిన్ వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా యాంగ్జైటీ ఎటాక్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లల్లో బ్రెయిన్ పవర్ పెరిగి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. నెయ్యి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి నాడీ వ్యవస్థపై పనిచేస్తాయి. పాలు మెదడులో గుల్టథియోన్ వృద్ధికి తోడ్పడుతాయి. గుల్టథియోన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: Almond Milk Benefits: బాదం పాలు తాగితే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం!