Ravi Teja: ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రన్ చాలా వేగంగా మారిపోయింది. ఒకప్పుడు వారాల తరబడి థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు మూడు, నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ఆసక్తిని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ట్రెండ్‌కు భిన్నంగా మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి మాత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై పది రోజులు దాటినా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాను ఓటీటీ కోసం ఎదురుచూడకుండా పెద్ద తెరపైనే చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
