Milk and dates benefits: చాలా మందికి రక్త హీనత వేధిస్తూ ఉంటుంది. ఇందుకు పాలు ఖర్జూరంతో విరుగుడు లభిస్తుందని చెబుతున్నారు. ఖర్జూరంలో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సీ, ఈ, బీ అధికంగా ఉంటాయి. పాలు, ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. ఎముకల సాంద్రత పెరగడానికి దోహదం చేస్తాయి. కండరాల అభివృద్ధి జరుగుతుంది. (Milk and dates benefits)
పాలలో చాలా ఆరోగ్యకర పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. పాలలో క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ డీ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. పాలు తీసుకోవడం వల్ల ఎములు పటిష్టంగా తయారవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదం చేస్తాయి.
లైంగిక సామర్థ్యం పెరగాలంటే రాత్రి పూట ఓ గ్లాసు పాలలో ఖర్జూరం కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల స్టామినా పెరిగి శృంగారం బాగా చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. పాలలో ఖర్జూరాలు నానబెట్టి తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీ లభిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
ఇక ఖర్జూరంలోనూ అనేక పోషక విలువలున్నాయి. పాలతో పాటు ఖర్జూరం కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోనాలు సొంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఓ గ్లాసు పాలతో పాటు ఖర్జూరం కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి రెండూ బలమైన ఆహారమని చెబుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరంలో సెలీనియం, ఫాస్పరస్, ఫ్లోరిన్, జింక్, పొటాషియం, రాగి, తదితరాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవీ చదవండి: Benefits of Dates: డేట్స్ నానబెట్టుకొని తింటే ప్రయోజనాలివే.. పురుషుల్లో ఆ శక్తి పుంజుకుంటుంది!
Red Eyes: తరచూ కళ్లు ఎర్రగా మారుతున్నాయా? కారణాలు తెలుసుకోండి!