Anand Deverakonda: టాలీవుడ్‌లో ప్రేక్షకులకు ఎంతో నచ్చిన యువ జంటల్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన బేబీ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి నటించనున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి ఇద్దరూ తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సినిమా మరేదో కాదు.. చెన్నై లవ్ స్టోరీ. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఆనంద్ దేవరకొండ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
