Nara Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పర్యటించారు. దీపం 2.0 ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సభలో ఆయన (Nara Chandrababu Naidu) ఇంకా ఏమన్నారంటే..
‘‘నా మీటింగ్ లో ఆర్భాటాలు ఉండవు. బలవంతంగా మనుషులను తీసుకువచ్చే పని అంతకంటే ఉండదు. నేను వస్తున్నానంటే ఎక్కడా చెట్లు నరకడం ఉండదు. వీలైతే చెట్లు పెడతాం. ఎక్కడా పరదాలు కూడా ఉండవు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే చెప్పండి అవి కూడా తీసేయిద్దాం. గత ప్రభుత్వంలో మీటింగ్ లకు చుట్టు పక్కల ఐదారు జిల్లాల నుంచి జనాలను బలవంతంగా తీసుకువచ్చేవాళ్లు. చుట్టూ కందకాలు తవ్వి కూర్చేపెట్టేవాళ్లు.
ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అందరం కలిసి స్వేచ్ఛగా కూర్చుకుంటున్నాం..మాట్లాడుకుంటున్నాం. గుండెల్లో మనమీద అభిమానం ఉండాలి. బలవంతంగా తీసుకువస్తే ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదు. నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపినప్పుడు పీడ విరగడైందని దీపావళి చేసుకుంటున్నాం. చెడుపై మంచి గెలిచింది కాబట్టి పండుగ చేసుకుంటున్నాం. మనం కూడా చెడుపై గెలిచాం.
మన పార్టీ కార్యకర్తలను నరకయాతనకు గురి చేశారు. నన్ను హింస పెట్టారు. ఒక దుర్మార్గుడు పాలనలో మనం చాలా కష్టాలు పడ్డాం. ఆ దుర్మార్గుడిపై మనం రాజీలేని పోరాటం చేశాం. 1994లో కూడా గెలవనన్ని ఎక్కువ సీట్లు ఇప్పుడు గెలిచాం అంటే మీరు నాపై ఎంత ప్రేమ పెట్టుకున్నారో అర్థమవుతోంది. నిన్న నేను జైలు నుంచి విడుదలైన రోజు, దీపావళి ఒకరోజు వచ్చింది. అలా కలిసి వచ్చింది.
నన్ను జైలులో పెట్టినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 80 నుంచి 90 దేశాల్లో ప్రజలు స్పందించారు. మీరంతా కష్టపడి పనిచేశారు కాబట్టే ఇంత పెద్ద గెలుపు సాధ్యమైంది. గత ప్రభుత్వంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. శుక్రవారం వస్తే పడగొట్టేందుకు ప్రొక్లైన్లు వచ్చేవి. అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా అతన్ని వదలకుండా అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులు జైలులో పెట్టారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇప్పుడు ఇచ్చే దీపం పథకానికి దీపం -2 అని పేరు పెట్టాను.
ఎన్నికలముందు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ హామీని అమలు చేశాం. మాట నిలబెట్టుకున్నాం. శాంతమ్మ ఇంట్లో నేనే కాఫీ పెట్టాను. టీ పెట్టాను. అందరికీ టీ ఇచ్చాను. ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి. జనాభాలో 50 శాతం ఉన్నారు. మీరు కూడా ఆత్మగౌరవంతో బతకాలంటే ఎప్పటికప్పుడు మీరు కూడా పదిరూపాయలు సంపపాదించాల్సిన అవసరం ఉంది.
మగవారితో సమానంగా ఆడవాళ్లు రానిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న చొరవ. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఎన్టీఆర్ పెట్టారు. కాలేజీల్లో ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు నేను పెట్టాను . టీచర్ ఉద్యోగాల్లో 50 శాతం వచ్చేసింది. నేను డ్వాక్రా సంఘాలు పెట్టాను, డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకువస్తా. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని చెప్పాను. అందులో 50 శాతం డ్వాక్రాసంఘాల నుంచే వస్తారు.
1997లో బాలిక శిశు సంరక్షణ పథకం పెట్టాను. 7,8,9,10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశాను. ఏ పథకం తీసుకువచ్చినా మహిళల పేరుపైన తెచ్చాను. ఇంటి పట్టాలు కానీ, కళ్లు కట్టియడం కానీ, ఆస్తులు కానీ అన్నీ మహిళల పేరుపైనే చేశాం. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, బాలమృతం వంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. పెళ్లి కానుక తీసుకువచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
