Dwaraka Tirumala: సూపర్ సిక్స్ లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. ఇందులో భాగంగా ద్వారకా తిరుమలలో (Dwaraka Tirumala) పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉచిత సిలిండర్లను ప్రజలకు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘దీపం-2 పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండి, రౌడీయిజం ఎక్కువ అయిపోయి ప్రజా హక్కులను కాల రాస్తున్న సమయంలో ప్రతి ఊరిలో ప్రజలకు మేము అండగా ఉన్నామని చెప్పిన ప్రతి ఒక్క నాయకులు వేదికపైనా ఉన్నారు.
అప్పటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు మా కంటే బాగా చేయలేరని కామెంట్లు చేశారు. వాళ్లకంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోవడం తప్ప ఇచ్చే మనసు లేదు వాళ్లకి. మనకి దోచుకునే అవసరం లేదు, జేబుల్లోంచి డబ్బులు తీసి ప్రజలకు ఇచ్చే మనస్తత్వం మన నాయకులది. వైఎస్ఆర్ సీపీ చేసిన తప్పుడు, దోపిడీ, విధానాల వల్ల పాలసీదారులను తరిమికొట్టారు. వాళ్లు ఓడిపోయి 11 సీట్లకు మిగిలిపోయిన ఇంకా వాళ్లు నోర్లు ఆగడం లేదు.
లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా చింత చచ్చిన పులుపు చావలేదు మీకు. ఇంకా ఏం రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో. నన్ను విమర్శించే ప్రతిఒక్కరికి ఒక మాటే చెబుతున్నా. మేము చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిడతాం, మళ్లీ పాత పద్దతిలో కుటుంబసభ్యులను తిడతాం.. ఏదైనా మాట్లాడతం అంటే.. స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది.
గెలిచిన రోజున చెప్పాను పగ -ప్రతీకారం ప్రభుత్వం కాదని.. నేను మూడు నెలల పాటు ఒక్క మాట మాట్లాడలేదు. కానీ వాళ్లకు నోర్లు ఎక్కువ అయ్యాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి. తొక్కి నార తీస్తా గుర్తుపెట్టుకోండి. చూస్తారు భవిష్యత్ లో మీరు. మీకు చాలా సార్లు చెప్పాను మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను. మీకు గొడవే కావాలి ..మీకు కోరినంత గొడవ ఇస్తాను ..కానీ అది ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసులను చితకగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ అది. నాకు కూడా సహనం పోయింది నాలుగు నెలలు చూశాను.
ఆడబిడ్డ మాన ప్రాణాలకు ఏమైనా తేడా వచ్చిన చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు..వీళ్లందరిని కూడా గుర్తిస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్లలేరు..మీరు డీప్ ఫేక్ ఫోటోలతో కానీ టెక్నాలజీతో మీరు ఏం చేద్దామనికున్నా..మీ కోసం డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది.. ఎవరు తప్పులు చేసినా క్రిమినల్ రికార్డు ఉంటుంది.. మాకు గత ప్రభుత్వం అండ ఉంది మేము రోడ్ల మీదకు వస్తాం మేము కూడా మా మాదిరిగా పోరాటం చేస్తామంటే మేము చేసింది ధర్మపోరాటం మానహ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం.
మేము ఏనాడు కూడా ఆడ బిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలేదు. మీ ఇంటి వాళ్ల గురించి అన్యాయంగా మాట్లాడలేదు. ఆ నాయకుడు సొంత సోదరి నా ప్రాణాలకు రక్షణ కావాలి అంటే ,అదనంగా సెక్యూరిటీ కావాలంటే… అమ్మా మీ అన్న కల్పించలేకపోయాడేమేకానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీకు రక్షణగా ఉంటాం. మీ రక్షణ కోసం మీరు ముందుగా అప్పీల్ చేసుకోండి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం..మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.
నిన్న మోడీ గారు అన్నారు ఈ దేశాన్ని అస్థిరత్వం చేయడానికి చాలా మంది కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మన దేశ బోర్డ్లలో నే కాదు అది మన ఉభయగోదావరి జిల్లాల్లో కూడా వస్తాయి కానీ ఇంకో రకంగా వస్తాయి. అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా తెలియజేస్తున్నా మీరు అప్రమత్తంగా ఉండాలి ,సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసిన మీరు బలంగా మాట్లాడలేకపోతే కుల, మత ఘర్షణలు సృష్టించి గొడవలను పెద్దవి చేసి.. రేపు మళ్లి అమెరికా ,కెనడా లాంటి దేశాల్లో మనల్ని తిట్టే పరిస్థితికి తీసుకొస్తారు. అందుకే మోడీ గారు స్పష్టంగా చెప్పారు దేశ సమగ్రతను దెబ్బ తీయడానికి చాలామంది శక్తులు కుట్రలు చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.
ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులకు చెబుతున్నా .మీరు ఏదైనా విమర్శించండి కానీ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పనులు, మత విద్వేషాలు, రెచ్చగొడ్డం కానీ కుల ఘర్షణలు చేద్దామనుకున్నా. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లం మేము. మీరు ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించండి. వైఎస్ఆర్ సీపీ నాయకులకు, వారి మద్దతుదారులకు చెబుతున్నా మీరు ఇంకా చింత చచ్చిన పులుపు చావులేదన్నట్టు మీరు తిమ్మిరి తిమ్మిరిగా ఉన్నారు.
ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్ క్లియర్ గా మానిటర్ ..మీ ప్రతి స్టేట్ మెంట్స్ ని టైమ్స్ తో ఎవరూ ఏం మాట్లాడుతున్నారు ,ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు ,టీవీల్లో ,వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు ..ఇవ్వన్నీ మా దగ్గర ఉన్నాయి. చాలా బలమైన యాక్షన్ ఉంటుంది ..తర్వాత మీరు రోడ్ల మీదకు వచ్చి రాస్తోరోకోలు చేస్తామంటే కాళ్లు చేతులు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం.
151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదా?
ఈవీఎంలు మోసం చేస్తాయంట… ఇవే ఈవీఎంలు 151 సభ్యులు ఇస్తే మోసం చేయలేదా? 11 సీట్లు వస్తే మోసం చేశాయి. ఈవీఎంలు మోసం చేస్తే ప్రధానిగారికి 375 సీట్లు రావాలి అప్పుడు మరి. చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా మెతకగా ఉన్నారు ..ఆదేశాలు ఇస్తున్నా మీరు సరిగా పాటించడంలేదు. మీరు అందరూ గత ప్రభుత్వ కాలంలో ఊ అంటే ఆ అని కాసుకున్నారు ఆ ప్రభుత్వానికి. అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ధర్మంగా చేయండి అంటే సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ? నాకు అర్ధం కావడం లేదు హానీమూన్ పిరియడ్ అయిపోయింది. యాక్షన్లు ఉంటాయి.’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు
Pawan in Vizianagaram: గుర్లలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికీ రూ.1లక్ష
Pawan at Vizianagaram: విజయనగరంలో పవన్ పర్యటన.. అతిసార బాధితులకు పరామర్శ
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్
Pawan on YSRCP: జగన్ అమాయకుడు కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
