HomeAndhra PradeshIchapuram: ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.. మనసు, మానవత్వం ఉన్నాయి

Ichapuram: ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.. మనసు, మానవత్వం ఉన్నాయి

Ichapuram: ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, కానీ మనసు, మానవత్వం ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దీపం 2.0 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం (Ichapuram) నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

‘‘ఆ రోజుల్లో దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యధిక గ్యాస్ సిలెండర్లు ఇచ్చిన రాష్ట్రం ఏపీ. పరిస్థితులు అనుకూలిస్తే.. ముందు మీరు డబ్బులు చెల్లించి గ్యాస్ తీసుకున్న తర్వాత మేము డబ్బులు వేయడం కాకుండా.. డైరెక్టుగా మీకు ఉచితంగా గ్యాస్ సిలెండరు వచ్చే ఏర్పాటు చేస్తాం. పేదవాళ్లకు న్యాయం చేయడం మా లక్ష్యం… ఎంత ఖర్చైనా దీపం పథకం కింద ఏడాదికి 3 సిలెంరర్లు ఉచితంగా ఇస్తాం. పేదవాడికి పింఛను పథకం ప్రారంభించింది ఎన్టీరామారావుగారు చేశారు..రూ.35 తో ప్రారంభించారు.. దానిని రూ.70 చేసింది నేను.. తర్వాత పాలకులు రూ.200 చేశారు. (Ichapuram)

2014-19 మధ్య రూ.200 నుంచి 2000 చేశాం. పది రెట్లు చేసిన పార్టీ టీడీపీ.. తర్వాత వచ్చిన త ప్రభుత్వం ఏడాదికి రూ.250 చొప్పున రూ.3000 చేసింది. అదీ అడుక్కుంటే. ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధ:గా అత్యధికంగా పింఛనుపై డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. మనస్సు ఉంది.. మానవత్వం ఉంది. మొట్టమొదట ఒంటరి మహిళకు పింఛను ఇవ్వాలని ఆలోచన చేసింది టీడీపీ ప్రభుత్వమే.

మూడు నెలల పింఛన్లు ఒకే సారి తీసుకోవచ్చు. మొదటి నెల, రెండో నెల తీసుకోకపోయినా మూడో నెలలు మొత్తం కలిపి తీసుకోవచ్చు. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకుండా ఆపీసుకు రప్పిస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటా. లబ్ధిదారుల ఇంటికెల్లి పింఛను అందించే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకోవాలి. ఎన్నడూ చూడనంత విధ్వంసం గత ఐదేళ్లలో జరిగింది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అధఇకారుల్ల్ నిర్లిప్తత. ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ నా జీవితంలో నేను చూడలేదు. కేంద్రం డబ్బులు ఇస్తే వాళ్లు దారి మళ్లించారు. రూ. 41 వేల కోట్లు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొచ్చారు. రూ.1650 కోట్లు రైతులకు బకాయిలు పెట్టారు. నేను వచ్చిన వెంటనే వాటిని క్లియర్ చేయించా.. ఎవరైనా ధాన్యం అమ్మితే 48 గంటల్లో వారి అకౌంట్లలో జమ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. (Ichapuram)

ప్రజా నాయకులు అనే వాళ్లు కొన్ని విలువలు.. పద్ధతులు పాటించాలి. మనమే నేరాలు…ఘోరాలు చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు. నేను జవాబుదారీగా ఉంటే కలెక్టర్లు భయపడతారు.. నేను పెత్తందారీగా ఉంటే ఆ కలెక్టర్లు కూడా లెక్కచేయరు. వాళ్లని పిలిచి ఏం జరిగిందని అడిగితే.. నేలకు చూస్తున్నారు.. పరిస్థితి అర్థమైంది. ప్రతి ఒక్కరినీ బెదిరించారు.. భయపెట్టారు. పోలీసులను ఎంత మిస్ యూజ్ చేయాలో అంత చేశారు.. నేను కూడా ఒక కార్యకర్తను నా కుటుంబ సభ్యులకు ఎటువంటి అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. జనసైనికులు, బీజేపీ వాళ్లు అందరం కలిసి పోరాడం..పోరాడి విజయం సాధించాం.

ఐదు నెలలైంది.. ఇప్పటికి 143 రోజులు.. అనునిత్యం మీ గురించి ఆలోచిస్తున్నా.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. రాష్ట్ర అప్పులు రూ.10,50,000 కోట్లు.. వడ్డీ లక్ష కోట్లు.. అన్ని దిక్కులా అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో ఆపీసులు తాకట్టు పెట్టారు.. మందు బాబులు తాగుడును 25 ఏళ్లు తాకట్టు పెట్టారు. మీరు తాగుతుంటే.. ఆ డబ్బులు వస్తుంటే .. ఆయన అప్పులు తీరుస్తాడు.. అది కూడా నాసిరకం మందు.. ఇంక కడుపులో మంట.. అనారోగ్యం పాలయ్యారు. మొత్తం వాళ్లే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు..ఐదేళ్లు దోపిడీ చేశారు. ఇప్పడు అదంతా ప్రక్షాళన చేశా.. కొత్త కొత్త సవాళ్లు వస్తున్నాయి.దాని మీద యుద్ధం చేస్తున్నా.. (Ichapuram)

ఇంకోపక్క ఇసుక.. ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పా.. అంతా అస్తవ్యవస్థమైంది. ఐదేళ్లు దోపిడీ చేశారు.. ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వాలని కొన్నిసవాళ్లు వచ్చాయి. నేను గట్టిగా చెప్పా కూటమివాళ్లకి. ఫ్రీ ఇసుక ఇస్తా.. ఎవ్వరూ ఇన్ వాల్వ్ కావద్దని తమ్ముళ్లకు స్పష్టం చెప్పా..ట్యాక్స్ లన్నీ తొలగించి.. మీ ఊళ్లో ఉండే ఇసుకను మీరు ఫ్రీ గా తవ్వకోండని చెప్పిన ప్రభుత్వం ఇది.. ఎవరైనా సహకరించకపోతే ఫోన్ చేయండి వారి సంగతి చూస్తా..

ఇప్పుడు నాసిరకం మద్యం ఉండదు..అట్లా అని బెల్టు షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. తమాషా అనుకోవద్దండి..ఎక్కువ రేట్లు అమ్ముతుంటే..వెంటనే మొదటిసారి భారీ ఫైన్ వేయమన్నా.. రెండో సారి ఫైన్ లేదు..క్యాన్సిలే.. ఇసుక రేట్లను అధికంగా అమ్మితే ఎషన్షియల్ కమోడిటీ యాక్టు కిందకు తెచ్చి పీడీ యాక్ట్ పెడతాం.. పోలవరం పడకేసింది.. 460 కోట్లతో డయాఫ్రం వాల్ పూర్తి చేస్తే.. దుర్మార్గంగా ప్రవర్తించి..అక్కడ కక్కుర్తి పడితే.. అది కొట్టుకుపోయింది. దానిని కాపాడలేకపోతే.. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ కడుతున్నాం.. దానికి ఖర్చు 990 కోట్లు.. మూడు నాలుగేళ్లు ఆలస్యం అయిపోయంది. అలా అని పారిపోలేం. కేంద్రాన్ని ఒప్పించాం. ఫేజ్ 1 కింద 12500 కోట్లు డబ్బులిచ్చారు. ఫేజ్ 2 కూడా ఉంది. అనుకున్న విధంగా పైర్తి చేసే బాధ్యత కేంద్రానిది.

పెద్ద మెజార్టీతో గెలిపించారు
అమరావతి ఉద్యమం జరిగినప్పుడు.. మూడు ముక్కలాట ఆడినప్పుడు.. విశాఖ రాజధాని కావాలని రెచ్చగొడితే.. ఇక్కడి వచ్చి అడిగా.. మన రాజధాని ఏదని…అమరావతి రాజధాని అని చెబితే అతిపెద్ద మోజార్టీతో గెలిపించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. అమరావతిని గాడిలో పెట్టాం..కేంద్రం సహకరించింది.. జనవరిలోపు పనుల్నీ పూర్తి స్వింగ్ లోకి వచ్చేలా చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్.. ఎన్నికల ముందు చెప్పాం.. కాపాడతామని.. కేంద్రంతో.. రెండు మూడు మీటింగులయ్యాయి..కేంద్రం డబ్బులిచ్చింది. సెకండ్ ఫర్నిస్ కూడా ఆపరేట్ చేయడం మొదలుపెడితే.. అజాగ్రత్తగా ఉన్నామని విమర్శిస్తున్నారు..నేను ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.. ఏ పనులు చేయగలుగుతామో చాలా స్పష్టంగా చెప్పి.. అది పూర్తి చేసే వరకు నిద్ర పోనివ్వకుండా చేసే వ్యక్తులం మేము.

డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ విధానాన్ని తీసుకువచ్చాం.. మేము చేయూత ఇస్తాం.. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం.. మీరు కూడా ముందుకు రండి.. ఉద్యోగాలు చేసేవాళ్లు ఉద్యోగాలు చేయండి.. ఉద్యోగాలు కల్పించగలిగే శక్తి ఉండే వాళ్లు.. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం.. ఈ దుర్మార్గులుంటే మీ భూమి కూడా మీకు ఉండేది కాదు. మీ భూముల్లో నాటే సర్వే రాళ్ల పైన అతని బొమ్మ వేసుకున్నాడు.. అది తీయాలంటే నాలుగైదు వందలు కోట్లు ఖర్చయ్యే పరిస్థితి.. మీ తాత ముత్తాతలు నుంచి వచ్చిన పట్టాదారు పుస్తకాలమీద కూడా వాళ్ల బొమ్మ వేసుకున్నారు.. అది తీయడానికి మళ్లా దానికి ఖర్చు.. ఒకటికాదు.. ఎన్ని విధ్వంసాలు చేయాలో అన్ని చేశారు. చెత్తమీద పన్ను వేశారుగానీ.. చెత్త తీయలేదు.. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రాష్ట్రంలో ఉంది.. నమ్ముతారా మీరు.. మచిలీపట్నం వెళితే చుట్టుపక్కల కొండలు కొండలుగా చెత్త పేరుకుపోయింది. అది చెత్త ప్రభుత్వ కాక మరేమిటి? ఆ చెత్త తీయడానికి నాకో సంవత్సరం పడుతుంది. దీనికి వేయి కోట్లు ఖర్చవుతోంది.

217 జీవో రద్దు చేశాం
మత్స్యకారుల ఉపాధి కోసం జీవో 217 రద్దు చేశాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ తీసుకువచ్చాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించాం. అర్చకుల జీతాలు రూ.15 వేలు చేశాం.. క్షురకులకు రూ.25 వేలకు వేతం పెంచాం. ఏపీ, తెలంగాణలు కలిసి నవంబరు1 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 2014లో ఏపీ, తెలంగాణ విడిపోయాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన రోజును (డిసెంబర్ 15, 1952).. గుర్తు పెట్టుకుంటాం.. విభజన జరిగిన రోజు జూన్ 2వ తేదీ.. ప్రాణత్యాగం చేసింది వేరే తేదీ.. ఉమ్మడి ఏపీ వచ్చిన రోజు వేరు. త్యాగధనులను శాశ్వతంగా గుర్తు పెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read also: CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లపై బిగ్ అప్ డేట్.. డబ్బులు రిలీజ్
Free Gas Cylinder: మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్ డేట్!
AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు