CBN on Jagan Family issue: వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల ఆస్తుల గొడవల అంశం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు, ఆ వర్గం సోషల్ మీడియా మొత్తం జగన్ పై పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబును (CBN on Jagan Family issue) కొందరు విలేకరులు దీనిపై ప్రశ్నలు అడగ్గా.. ఆయన రియాక్ట్ అయ్యారు. అంతకు ముందు విజయనగరం పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మా అమ్మ ఫొటో, చెల్లి ఫొటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.
జగన్ కుటుంబ వ్యవహారంపై చంద్రబాబు స్పందిస్తూ.. జగన్ మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అందుకే ఎన్నికల్లో జగన్ ను చిత్తుగా ఓడించారన్నారు. ప్రజా వేదిక కూల్చాడని, అలాంట పనులు తాను చేయలేనా? అని ప్రశ్నించారు. అమరావతిని సర్వనాశనం చేశాడని, చెల్లికి ఆస్తి ఇవ్వడానికి కండీషన్ పెడతాడా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయం చేస్తాడని ఊహించలేదన్నారు. జగన్ చిల్లర, చెత్త రాజకీయాలు చేస్తున్నాడన్నారు. విలువలు లేని మనిషి సమాజానికి చేటని వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా జగన్ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని కామెంట్ చేశారు. వివేకాను కూడా మేము చంపేశామని తప్పుడు ప్రచారం చేశారన్నారు. చెత్త టీవీ, చెత్త పేపర్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
వాళ్ల ఇంట్లో తల్లి, చెల్లికి గొడవ అయితే కూడా మా గురించి మాట్లాడుతున్నాడని, ఇంకా ఏం చెబుతాం? అన్నారు. తల్లి విషయాన్ని కూడా బజారులోకి లాగి మా గురించి మాట్లాడం ఏంటి, మనకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది …? భార్యకు వస్తుంది..అలాంటి తల్లిని కూడా ఇది చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఏమనాలని ప్రశ్నించారు.
‘‘అక్కడకి పోయి ఏదో రూ.2లక్షలు ఇస్తున్నాడు. ఏంటి ఆ రెండు లక్షలు నువ్వు ఉన్నప్పుడు ఉందా? ఏవరైనా చనిపోతే ఇలా డబ్బులు ఇచ్చారా? కొత్త ఒరవడి.. ఏదో నేను ఇస్తున్నానంటే.. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని లక్షలు? ఏమైనా వ్యవసాయం చేసి సంపాదించాడా? 2004లో ఎంత ఆదాయం జగన్ ది? ఇవ్వన్నీ ఒక నీతివంతమైన పాలిటిక్స్ చేసినప్పుడు కొద్దిగా పద్ధతులు ఉంటాయి. ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అనుకుంటే.. ఆ రోజులు పోయాయి. అందుకే చెప్పా ఎస్కో బార్ అని.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘‘వైయస్సార్ సీపీలో ఉన్నామని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం దాచిపెట్టిన చీకటి జోవోలపై విచారణ జరిపిస్తాం. చీకటి జీవోల్లోని అక్రమాలు నిగ్గుతేల్చి గత తప్పిదాలు సరిదిద్దుతాం. షర్మిలను నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడావు కాబట్టి ఆస్తి రిటర్న్ తీసుకుంటానని NCLT కేసు వేసేవాళ్లు.. వీళ్లు కావాలా మనకు? నేను ఎప్పుడు ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని అనుకోలేదు. పాలిటిక్స్ లో ఫైట్ చేశాను. సమఉజ్జీలతో, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాను. రాజకీయ పోరాటాలు సిద్ధాంతాలు ప్రకారం చేశాను. ఇవి చిల్లర రాజకీయాలు. ఇలాంటి వాళ్లకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటి వాళ్లతో మాట్లాడటం కానీ, ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ నాకు సిగ్గు అనిపిస్తోంది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నన్ను బయటకు రానివ్వలేదు
‘‘గత ఐదేళ్లల్లో నన్ను బయటికి కూడా రానివ్వలేదు.. మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా? మేము నిన్ను నిలువరించామా? అంటే నాకు చేతకాదా? నేను రాజకీయాలు చేయలేనా? నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు? అమరావతికి వెళ్తే రాళ్లతో దాడి చేస్తే డీజీపీ ప్రజాస్వామ్యం అంటాడు. మాఇంటి మీదకు ఎమ్మెల్యేను దాడికి పంపించారు.’’ అని చంద్రబాబు కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
YS Jagan at GGH: ఏరి ఏరి మరీ జైళ్లలో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్!
Jagan on Badvel murder: మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం?
