HomeAndhra PradeshCM CBN on Railway Projects: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబు కీలక...

CM CBN on Railway Projects: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM CBN on Railway Projects: అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం చేయనున్నారు. హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, నాగ్ పూర్ ను రైల్వే లైన్ కలుపుతుంది. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు (CM CBN on Railway Projects) మీడియాతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

‘‘రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు 4 లైన్ల నుంచి 6 లైన్లు చేయడం చాలా సంతోషం. ఇప్పటికే రూ.76వేల కోట్ల ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉన్నాయి. టోటల్ ప్రాజెక్టులు 129 ఉన్నాయి. 3,300 కిలోమీటర్లు పనులు జరుగుతున్నాయి. వీటిపై ఈ రోజు సమీక్ష చేయడం జరిగింది. దీని కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం.. ఆర్ అండ్ బీ, సీసీఎల్ఏ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఇంకా అవసరమైన డిపార్ట్ మెంట్‌లు అన్నీ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం.

ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీ చేశాం కాబట్టి ఎక్కడా అర్డల్స్ లేవు. లోటల్ గా 8,704 కిలోమీటర్లు నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వేసివి 3,300 కిలోమీటర్లు రాబోయే రెండేళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నాం. 4 లైన్ల రోడ్లు ఎక్కువ ఉన్నాయి.. 6 లైన్ల రోడ్లు తక్కువ ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా 6 లైన్లు, 8 లైన్లు ఎక్కువగా రావాల్సి ఉంది.

ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వే రెండు.. ఢిల్లీ టు వడోదర… వ‌డోద‌ర టు ముంబై ఒక్కటే 8 లైన్ల‌ రోడ్డు ఉంది. మిగతావన్నీ 6 లైన్లు ఉన్నాయి. మన దగ్గర తక్కువ ఉన్నాయి. కలకత్తా నుంచి మనకు వచ్చే ఇఛ్చాపురం నుంచి తడ వరకు రోడ్డు ఒకటి అవ‌కాశం ఉంది. ఇప్పుడే కొత్తగా శాంక్ష‌న్ చేయడం జరిగింది. మన దగ్గర ఇంతకు మునుపు 6 లైన్లు నరసన్నపేట టు రణస్థలం.. ఇది ఒకటి ఉంది. ఇప్పుడు రణస్థలం టు శ్రీకాకుళం అది శాంక్షన్ చేశారు.

కొన్ని రోడ్లు వేర్వేరు కారణాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. 47 ఆన్ గోయింగ్ ఉంటే. నిలిచిపోయినవి 15 ఉన్నాయి.. బిడ్డింగ్ స్టేజీలో 6 ఉన్నాయి. దీనికి ల్యాండ్ అక్వైజేషన్ సమస్యలు ఉన్నవి 70 వరకు. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ 23 వరకు ఉన్నాయి. ఇంకా టోల్ ప్లాజెస్ స‌మ‌స్య‌లు 2 ఉన్నాయి. మొత్తం 95 ప్రాజెక్టులకు ప్రాబ్లం ఉన్నాయి. వీటన్నింటికి మూడు నెలల్లో ల్యాండ్ అక్వైజేషన్ క్లియర్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్విరాన్మెంటల్ రీజనల్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అవన్నీ క్లియర్ చేయడానికి స్పష్టమైన డేట్ కూడా పెట్టాం.

ఉదాహరణకు బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ ప్రెస్ వే ఇంకా కొన్ని సమస్యలు ఉంటే 15 రోజుల్లోపు ఎన్విరాన్‌మెంట్ క్లియర్ చేయమన్నాం. కడప, చిన ఓరంపాడు ఇది 4 లేన్ల రోడ్డు దీన్ని 15 రోజుల్లోపు కంప్లీట్ చేయమన్నాం. ఇవి కాకుండా ఇంకోపక్కన నేషనల్ హైవేలు 42 ఇవి చిన్న చిన్న డిటేల్స్ ఉంటే పాడేరు బైపాస్ కానీ, దేవులపల్లి టు మల్లపాలెం ఇవన్నీ చాలా నిలిచిపోయి ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. బైరెడ్డిపల్లి టు వి.కోట ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్ ప్రెస్ వే ఫ్రంమ్ బెంగళూరు టు చెన్నై అది కూడా పెండింగ్ ఉంటే అది కూడా క్లియర్ చేయమన్నాం.

ఈ రోజు ఆఫీసర్ల మీటింగ్ లో నేను చాలా స్పష్టంగా చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్స్, కాంట్రాక్టర్లను కూడా పిలిచాం. వాళ్లకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కేంద్రం, రాష్ట్రం పూర్తిగా సహకరిస్తాం. అనుకున్న సమయానికి అన్ని పనులు చేయాలని చెప్పాం. దగ్గర దగ్గర ఈసారి 17వేల కోట్ల నుంచి 18వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేస్తారు. ఈ 18వేల కోట్ల రూపాయల ఈ సంవత్సరం పూర్తి చేస్తే వచ్చే సంవత్సరం గేర్ అప్ చేసి 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అది కూడా 2 నుంచి రెండున్నరేళ్లలోపు.

దీనికి 636 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కొన్ని ఉన్నాయి.. అందులో అవుటర్ రింగ్ రోడ్డు.. కుప్పం టు హోసూర్ అదే మాదిరిగా కోస్టల్ హైవే ఫ్రం మూలపేట టు విశాఖపట్నం ఇంకో పక్కన హైదరాబాద్ నుంచి మచిలీపట్నం కనెక్టు చేసేటట్లుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే.. పార్లల్ టు విజయవాడ టు హైదరాబాద్ దీన్ని మొత్తం ఈ నాలుగు రోడ్లు చూస్తే 636 కిలోమీటర్లు దూరం 45,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా డిస్కస్ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు అయితే బీపీఆర్ తయారు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు 3 ఏళ్లు అనుకున్నాం.. కుప్పం నుంచి హో సూర్ రెండున్నరేళ్లు అనుకున్నాం. హైదరాబాద్ ది మాత్రం సెంట్రల్ కేబినెట్ కు పోవాలి. (CM CBN on Railway Projects)

ఇవి పూర్తి అయితే.. మన రోడ్లు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాంజిస్టిక్స్ లో సిరీస్‌ ఆఫ్ పోర్ట్స్.. ఇప్పటికే ఐదారు పోర్టులు ఉన్నాయి.. ఇంకా మూడు పోర్టులు వస్తాయి. అమరావతి న్యూ క్యాపిటల్ వస్తుంది. అదే సమయంలో బెస్ట్ కనెక్టివిటీ వస్తుంది. బెంగళూరు, హైదరబాద్, చెన్నై, కలకల్తా ఇలాంటివి చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోపక్కన ఈ రాష్ట్రం అక్వాకల్చర్‌, ఆర్టికల్చర్ ఈ రెండూ కూడా ఎక్స్‌పోర్టుకు చాలా అవ‌కాశాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఇప్పుడు రైల్వేది కూడా 70 వేల కోట్ల రూపాయ‌ల పనులు జ‌రుగుతున్నాయి. రైల్వే స్టేష‌న్లు, రైల్వే లైన్లు అమ‌రావ‌తికి క‌నెక్టివిటీ ఇవ‌న్నీ ఉన్నాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్లుగా అన్ని ప్రాజెక్టులు ఎక్క‌డ కూడా ప‌నులు జ‌ర‌గ‌కుండా ఆగిపోయాయి. లాజిస్టిక్స్ అనేది ఏదైతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి క్రూషియ‌ల్‌గా ఉండే క‌నెక్టివిటీ మిస్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఫోక‌స్ మొత్తం అశ్ర‌ద్ధ పెట్టారు. ఇప్పుడిప్పుడే అన్నీ ట్రాక్ లో పెట్టాం. ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద తీసుకువ‌చ్చాం. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉండాలంటే చాలా క్లియ‌ర్ గా స్పీడ్ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ జ‌ర‌గాలి.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు కానీ ఏదైతే లాజిస్టిక్స్ ను, ప‌రిటాల ద‌గ్గ‌ర మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్స్ పార్క్ ఇవ‌న్నీ ఏంటంటే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గారు.. గ‌తిశ‌క్తి పోర్టు క‌నెక్టివిటీ చాలా చేస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర ఇంకా 14 శాతం ఉంటే ఇంట‌ర్ నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ లో 8 శాతం ఉంది. మ‌న ద‌గ్గ‌ర 14 శాతం లాజిస్టిక్స్ కాస్ట్ వ‌చ్చింది. దీన్ని ఘ‌న‌నీయంగా త‌గ్గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.’’ అని చంద్రబాబు తెలిపారు.

ఎక్స్ లో గడ్కరీ పోస్ట్
మరోవైపు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కలల ప్రాజెక్టు వాస్తవ రూపంలోకి: రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ కు ఇది చరిత్రాత్మక రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజధాని నుంచి ఏ ప్రాంతానికైనా అనుసంధానం చాలా కీలకం అన్నారు. 10 రోజుల స్వల్ప వ్యవధిలో కేబినెట్ ముందుకు తెచ్చారని, ఇది శుభపరిణామమన్నారు. అమరావతి కలల ప్రాజెక్టు వాస్తవ రూపంలోకి వస్తుందన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ప్రాజెక్టులు దోహదం చేస్తుందన్నారు.

ఏపీకి బూస్ట్: పవన్
అమరావతి రైల్వే ప్రాజెక్టు ఏపీకి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని పవన్ గుర్తు చేశారు. ఐదేళ్లు విలువైన సమయం వృథా అయిందని పవన్ విమర్శించారు. వీలైనంత త్వరగా రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.

ఇవీ చదవండి: CBN in Party Meeting: చెత్తను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్లారు
CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు