HomeAndhra PradeshSharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!

Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!

Sharmila on Jagan: తమ కుటుంబంలో ఆస్తి తగాదాలపై షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం నాలుగు గోడల మధ్య, చర్చల మధ్య కొనసాగడం దాటిపోయి కోర్టుల వరకు చేరుకోవడంతో నిన్నటి నుంచి మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ స్పందించారు. ఘర్ ఘర్ కీ కహానీ.. ఇది ప్రతి ఇంట్లో ఉండేదేనని, దీన్ని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇదే వ్యవహారంపై సీఎం చంద్రబాబు సైతం కామెంట్స్ చేశారు. షర్మిల (Sharmila on Jagan) కూడా స్పందించారు.

‘‘మామూలుగా అన్ని కుటుంబాల్లో గొడవలు ఉండటం సహజమే. ఎవరూ కాదనడం లేదు. మా ఉద్దేశం కూడా గొడవలను నాలుగు గోడల మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నదే. కానీ, ఇది సామాన్యం అంటూనే అన్ని కుటుంబాల్లో జరిగే విషయం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్.’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

అందరూ అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్టుల్లో కేసులు వేయరు కదా? అని షర్మిల ప్రశ్నించారు. అందరి కుటుంబాల్లో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్టుల్లో కేసులు వేసుకుంటారా ? కుటుంబాల్లో సమస్యలు ఉండటం సహజమే. కానీ అందరూ అమ్మ మీద కేసు వేసి కోర్టుకి లాగరు కదా? అని షర్మిల ప్రశ్నించారు.

అనుబంధాలను జగన్ మరిచిపోయారని విమర్శించారు. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధాన్ని మరిచారన్నారు. చెల్లెలిపై ప్రేమతో షేర్లు బదలీ చేశారనేది పచ్చి అబద్ధమన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ గా షర్మిల అభివర్ణించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్లపైకి తెచ్చారని ఫైర్ అయ్యారు.

అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారన్నారు. ఆస్తులు లాక్కోవడానికి ఈడీ కేసులని, బెయిల్ రద్దవుతుందని కారణాలు చెబుతున్నారని విమర్శించారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదన్నారు. ఈడీ కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసిందన్నారు. కంపెనీ షేర్లను ఎప్పుడూ అటాచ్ చేయలేదన్నారు. ఎప్పుడైనా వాటిని బదిలీ చేసుకోవచ్చని షర్మిల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan bail: జగన్‌ బెయిల్‌ రద్దు ప్రమాదం!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?
YS Jagan at GGH: ఏరి ఏరి మరీ జైళ్లలో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు