HomeSportsMohammed Shami: ఫిట్ నెస్ పై కీలక స్టేట్ మెంట్ ఇచ్చిన మహ్మద్ షమీ

Mohammed Shami: ఫిట్ నెస్ పై కీలక స్టేట్ మెంట్ ఇచ్చిన మహ్మద్ షమీ

Mohammed Shami: టీమిండియా క్రికెటర్, పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) తన ఫిట్ నెస్ పై కొంత కాలంగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. తాజాగా తన ఫిట్ నెస్ పై అప్ డేట్ (Shami Fitness Update) ఇచ్చాడు. తాను ప్రస్తుతం గాయం నుంచి 100 శాతం కోలుకున్నానన్నాడు.

ప్రస్తుతం నొప్పి పూర్తిగా తగ్గిపోయిందన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌ అనంతరం చీలమండ గాయానికి షమీ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో షమీ పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల టీమిండియా సారథి రోహిత్ శర్మ షమీ ఫిట్‌ నెస్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ మోకాలిలో వాపు రావడంతో కాస్త ఆలస్యంగా రికవరీ అవుతున్నాడని హిట్ మ్యాన్ చెప్పాడు. పూర్తిగా కోలుకోకుండా షమీ ఆస్ట్రేలియా దేశానికి వెళ్లాలనుకోవడం లేదన్నాడు. ఈ నేపథ్యంలోనే షమీ తన ఫిట్‌నెస్‌పై తాజాగా అప్ డేట్ ఇచ్చి కోలుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న షమీ.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన అనంతరం ఆదివారం నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ వేశాడు.

తాను నిన్న బౌలింగ్ చేసిన విధానం చాలా సంతోషాన్ని ఇచ్చిందని షమీ చెప్పాడు. అంతకు ముందు తక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేశానని తెలిపాడు. ఎక్కువ లోడ్ తీసుకోకూడదని అనుకున్నానని, అందుకే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే, ఆదివారం తాను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానన్నాడు. వంద శాతం బౌలింగ్ చేశానని, పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నాడు.

ఇప్పుడు నొప్పి పూర్తిగా తగ్గిందని, తాను ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడతానా లేదా అనిచాలా మంది ఎదురు చూస్తున్నారన్నాడు. కానీ, దానికి ఇంకా సమయం ఉందన్న షమీ.. ప్రస్తుతం తన దృష్టంతా ఫిట్‌నెస్‌పై, ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంత బలంగా తయారు కావాలనే దానిపైనే ఉందన్నాడు. ఆస్ట్రేలియాలో తనకు బౌలింగ్ అనుభవం ఉందని, ఎలాంటి బౌలింగ్ ఎటాక్ చేయాలో అవగాహన ఉందన్నాడు. మైదానంలో ఎక్కువ సమయం గడపాల్సి ఉందన్నాడు. తొలుత రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

ఇవీ చదవండి: Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Rohit Sharma: రోహిత్‌ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్‌ఔట్‌ అయ్యింది ఎవరంటే..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు