Rohit Sharma: న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ముంగిట ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఈ నెల 16వ తేదీ నుంచి ఇండియా, కివీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు (అక్టోబర్ 24-28) పుణెలో, మూడో టెస్టు (నవంబర్ 1 నుంచి 5 వరకు) ముంబైలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ ముంగిట అనేక రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవి బ్రేక్ చేసే చాన్స్ ఉంది.
* హిట్ మ్యాన్ మరో 5 సిక్స్‌లు కొడితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు.
* ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు) ఇప్పటి వరకు టాప్ లో కొనసాగుతున్నాడు.
* రెండు డబ్ల్యూటీసీల్లో 1,000కి పైగా రన్స్ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకు ఎక్కే చాన్స్ ఉంది.
* హిట్ మ్యాన్ 2019-21లో 1,094 రన్స్ చేశాడు. 2023-25 డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 742 పరుగులు చేశాడు. మరో 258 రన్స్ చేస్తే వెయ్యి పరుగులు కంప్లీట్ అవుతాయి.
* అజహరుద్దీన్ (14 విన్స్, 47 మ్యాచ్‌లు)ను హిట్ మ్యాన్ అధిగమించే చాన్స్ ఉంది. రోహిత్ ప్రస్తుతం (12 విన్స్, 18 మ్యాచ్‌లు)తో ఉన్నాడు.
* ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా సౌరభ్ గంగూలీ రికార్డును హిట్ మ్యాన్ ఓవర్ టేక్ చేస్తాడు.
* గంగూలీ (97 విన్స్, 195 మ్యాచ్‌లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ (95 విన్స్.. 128 మ్యాచ్‌లు) ఐదో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
* న్యూజిలాండ్ తో సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంటే డబ్ల్యూటీసీలో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా రోమిత్ ఘనత సాధిస్తాడు.
* 2019-2022 మధ్య విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 14 మ్యాచుల్లో గెలుపు సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే కోహ్లీని రోహిత్ అధిగమిస్తాడు.
* కివీస్ పై మూడు టెస్టుల్లోనూ భారత జట్టు విక్టరీ నమోదు చేస్తే భారత్ తరఫున నాలుగో అత్యుత్తమ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డులు తిరగరాస్తాడు.
ఇవీ చదవండి: Rohit Sharma: హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే బాక్సులు బద్దలే!
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్ఔట్ అయ్యింది ఎవరంటే..!
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
