Rohit Sharma: రోహిత్‌ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్‌ఔట్‌ అయ్యింది ఎవరంటే..!

ఐపీఎల్‌లో (IPL) విజయవంతమైన సారధిగా పేరుగాంచాడు రోహిత్‌ శర్మ (Rohit Sharma). ఐదుసార్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కప్పును గెలుపొందిన ఘనత హిట్‌మ్యాన్‌కే (Rohit Sharma) దక్కుతుంది. అయితే, తాజాగా రోహిత్‌ (Rohit Sharma) ఓ చెత్త రికార్డును చేరుకున్నాడు. ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ జట్టు (CSKvMI) తలపడింది. ఈ మ్యాచ్‌లోనే హిట్‌మ్యాన్‌ ఈ చెత్త రికార్డును చేరుకున్నాడు. ఇంతకీ ఆ చెత్త రికార్డు ఏంటి? ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కేయండి.

ఐపీఎల్‌ 2023 (IPL 2023) సీజన్‌లో నేడు చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సీఎస్కేతో ముంబై మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్‌ చేసింది. మామూలుగా ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు వచ్చే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇవాళ మాత్రం వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే, తాను ఎదుర్కొన్న మూడో బంతికే దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ల్యాప్‌ షాట్‌ ఆడేందుకు యత్నించిన హిట్‌మ్యాన్‌.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధికంగా 16వ సారి డకౌట్‌ అయ్యాడు రోహిత్‌ శర్మ.

దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే రోహిత్‌ కొత్త, చెత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు దినేష్‌ కార్తీక్, మన్‌దీప్‌ సింగ్‌, సునీల్‌ నరైన్‌లు 15 సార్లు డకౌట్‌ అయ్యి రికార్డు సృష్టించారు. వీరితో కలిసి హిట్‌ మ్యాన్‌ కూడా ఉండేవాడు. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరుకోవడంతో అత్యధికసార్లు డకౌట్‌ అయిన తొలి బ్యాటర్‌గా చెత్త రికార్డుల్లోకి ఎక్కాడు. వీరందరి తర్వాత సీఎస్కే ఆటగాడు, తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు 14 సార్లు డకౌట్‌తో ఐదో స్థానంలో కొనసాగడం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి మహేంద్ర సింగ్‌ ధోని.. బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో వరుస గెలుపులతో మంచి జోరుమీదున్న ముంబై.. భారీ టార్గెట్‌ ఇస్తుందని అభిమానులు భావించారు. అందుకు భిన్నంగా ప్రారంభంలోనే ముంబై వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గ్రీన్, ఇషాన్‌ కిషన్‌ 13 పరుగుల టీమ్‌ స్కోరు వద్ద వెంట వెంటనే ఔట్‌ అయ్యారు. అనంతరం వచ్చిన రోహిత్‌ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌, వధేరా టీమ్‌ స్కోరును రొటేట్‌ చేయసాగారు.

నేహాల్‌ వధేరా చెలరేగి ఆడి అర్ధ శతకంతో రాణించాడు. 51 బంతులు ఎదుర్కొన్న వధేరా.. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 64 పరుగులు చేశాడు. అనంతరం పతిరాణా బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 26 పరుగులు, స్టబ్స్‌ 20 పరుగులే చెప్పుకోదగ్గ స్కోర్. మిగతా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. గత మ్యాచ్‌లోనూ అంతకు ముందు చెలరేగి ఆడిన టిమ్‌ డేవిడ్‌ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. ఆర్‌ఆర్‌పై వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబైని గెలిపించిన డేవిడ్‌.. ఆ తర్వాత మ్యాచ్‌ పంజాబ్‌తోనూ చెలరేగిపోయాడు.

వరుసగా రెండు మ్యాచ్‌లలో రాణించి.. సీఎస్కేతో మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. 4 బంతుల్లో 2 పరుగులే చేసి తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు టిమ్‌ డేవిడ్. మొత్తంగా ముంబై ఇండియన్స్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లు.. శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డ్వేన్‌ కాన్వే మంచి ప్రదర్శన కనబరిచారు. గైక్వాడ్‌ 16 బంతుల్లోనే 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ కాన్వే కాస్త నెమ్మదిగా ఆడాడు. 42 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

అజింక్యా రహానె 21 పరుగులు, అంబటి రాయుడు 12, శివమ్‌ దూబె మూడు సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఆఖర్లో మహేంద్ర సింగ్‌ ధోని మూడు బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. 17.4 ఓవర్లలో 140 పరుగుల టార్గెట్‌ను సీఎస్కే చేరుకుంది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్స్‌ టేబుల్‌లో 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది.

Read Also : UnEmployment: జాబ్‌లెస్‌ లైఫ్.. ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా 8% దాటిన నిరుద్యోగిత రేటు..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles