సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 15 అక్టోబర్ 2024

Dhoni Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హెలికాప్టర్ షాట్ల పితామహుడు మహేంద్రసింగ్ ధోని.. మరో క్రికెటర్ రోహిత్ శర్మపై (Dhoni Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఓ మ్యాచ్ లో రోహిత్‌ ఆటతీరుని ధోని ప్రస్తావించాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. రోహిత్‌ శర్మకు టాలెంట్‌ దేవుడిచ్చిన బహుమతి అంటూ పొగడ్తలు కురిపించాడు.

టీమిండియా క్రికెట్ హిస్టరీలో అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్‌ సెంచరీలు బాదేసిన చరిత్ర కేవలం హిట్ మ్యాన్ దే. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ.. (Dhoni Rohit Sharma) మొదటి మూడు మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. అనంతరం అతడి నాలుగో వన్డే మ్యాచ్‌ నుంచి జట్టులో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. ఆ మ్యాచ్ అతడి కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు.

ఆ మ్యాచ్‌లోనే 93 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టు విక్టరీలో హిట్ మ్యాన్ కీలక భూమిక వహించాడు. ఆ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్‌ తనదైన శైలిలో ఆటతీరు కనబరుస్తూ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. టీమిండియా 48 ఓవర్లలోనే 258 పరుగులు చేసి 3-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకోవడంలో రోహిత్ శర్మది కీలక పాత్ర.

రోహిత్ (Rohit) ప్రదర్శన గురించి ధోని మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ (Hit man) అద్భుతంగా ఆడగలడని మెచ్చుకున్నాడు. అతడి ఆటతీరుకి తాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానన్నాడు. హిట్ మ్యాన్ కు ప్రతిభ దేవుడిచ్చిన బహుమానంగా ధోని (Dhoni) అభివర్ణించాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం హిట్ మ్యాన్ కు చాలా కీలకం అన్నాడు. టీమ్ లో గొప్ప స్థాయికి చేరుకోవడానికి ఇలాంటి ప్రదర్శన కాన్ఫిడెన్స్ ను నింపుతుందన్నాడు.

పర్సనల్ గా హిట్ మ్యాన్ ఆడే పద్ధతిపై తనకు బాగా ఆనందంగా ఉంటుందన్నాడు. అప్పుడు రోహిత్‌, మనోజ్‌ తివారిలు జట్టులో ఓపెనర్లుగా ఉండేవారని ధోని గుర్తు చేసుకున్నాడు. ఇద్దరిలో ఒకరు కచ్చితంగా దూకుడుగా ఆడేవాళ్లు ఉండాలని భావించామని, మనోజ్‌ అలాంటి ప్రదర్శన చేయలేడు కనుకర హిట్ మ్యాన్ దాన్ని సవాల్ గా తీసుకుని రాణించాడని ధోని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఓపెనర్‌గా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని మహీ గుర్తు చేసుకున్నాడు. కాగా, రోహిత్‌ 265 వన్డే మ్యాచ్‌ల్లో 10,866 పరుగులు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ తన 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. వన్డే చరిత్రలో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అత్యధిక స్కోర్‌ (264) ఒక్కడే నమోదు చేసి అబ్బురపరిచాడు.

2019 వన్డే వరల్డ్ కప్పులో ఒకే ఎడిషన్‌లో 5 శతకాలు బాదాడు. 241 ఇన్నింగ్స్‌లోనే 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా హిట్ మ్యాన్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కాగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్ట్‌కు రోహిత్ అవైలబుల్ ఉంటాడో లేదో ప్రస్తుతానికి డౌటేనంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇవీ చదవండి: Rohit Sharma: హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే బాక్సులు బద్దలే!
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma: రోహిత్‌ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. అత్యధిక సార్లు డక్‌ఔట్‌ అయ్యింది ఎవరంటే..!
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
MS Dhoni: ధోనిపై గౌతీ, హర్భజన్‌ హాట్ కామెంట్స్‌.. వ్యక్తిని కాదు, టీమ్‌ను చూడాలన్న మాజీలు!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading