HomeCinemaMahima Nambiar: మహిమ నంబియార్ క్యూట్ పోజులు.. ఎవరీ చిన్నది?

Mahima Nambiar: మహిమ నంబియార్ క్యూట్ పోజులు.. ఎవరీ చిన్నది?

Mahima Nambiar: ఇన్ స్టా గ్రామ్ లో నటి మహిమ నంబియార్ (Mahima Nambiar) క్యూట్ పోజులతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు పోజులు కొడుతూ ఫొటోలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంది.

ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు గోపికా పాలట్ చిరక్కరవీట్టిల్. 1994 డిసెంబర్ 21న జన్మించింది. మహిమా నంబియార్‌తో ఫేమ్ అయ్యింది. ప్రధానంగా తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది.

ఆమె కార్యస్థాన్ అనే చిత్రంలో నటించి తెరంగేట్రం చేసింది. ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యింది. తర్వాత కుట్రమ్ 23 చిత్రంలో నటించింది. ఈ మూవీ 2017లో వచ్చింది.

అలాగే మగముని (2019) లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మధుర రాజా (2019), RDX: రాబర్ట్ డోనీ జేవియర్ (2023) లాంటి చిత్రాల్లో నంబియార్ నటించి మెప్పించింది.

మహిమ కేరళలోని కాసరగోడ్‌కు చెందిన యువతి. ఆమె TIHSS నైమర్మూలలో స్కూల్ డేస్, విద్య అభ్యసించింది. 2014లో ఆమె ప్రైవేట్‌గా ఆంగ్ల సాహిత్యంలో BA చదివింది.

ఈ ముద్దుగుమ్మ శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి. 15 సంవత్సరాల వయసులో ఆమె మలయాళ చిత్రం కార్యస్థాన్‌లో దిలీప్ సోదరిగా నటించి చలన చిత్ర రంగ ప్రవేశం చేసింది.

టొరంటో తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో, ఆమె మగముని చిత్రానికి అత్యుత్తమ నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటి అవార్డును నంబియార్ గెలుచుకుంది. తాజాగా ఇన్ స్టాలో క్యూట్ లుక్స్ తో ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఇవీ చదవండి: Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Rashi Khanna: బ్లాక్‌ డ్రెస్‌లో అందాల రాశి.. లేటెస్ట్‌ హాట్‌ ఫొటోషూట్‌ వైరల్‌!
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు