Tamannaah Latest: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. ఆ చిత్రాలను ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకుంది. అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌ను అందరూ చూడాలంటూ తమన్నా పిలుపునిచ్చింది. అంతకుముందు జీకర్దాలోనూ తమన్నా నటించింది. (Tamannaah Latest)
వెబ్ సిరీస్‌లలో అందాల ఆరబోతతో తమన్నా దూసుకెళ్తోంది. జీకర్దాలో టాప్‌లెస్‌తో శృంగార సన్నివేశాల్లో తమన్నా నటించింది. ఈ వెబ్ సిరీస్‌కు భారీగా ఆదరణ లభించింది. అదే ఊపును కంటిన్యూ చేసిన మిల్కీ బ్యూటీ లస్ట్ స్టోరీస్‌లోనూ డోస్ కొనసాగిచింది. ఇందులో విజయ్ వర్మతో రొమాంటిక్ సన్నివేశాల్లో తమన్నా నటించింది.
Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్ హావభావాలు.. వీడియో క్లిప్స్ వైరల్!
స్క్రీన్‌పైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తమన్నా విజయ్ వర్మ లవ్ ట్రాక్ నడుస్తోంది. తనను ఎంతగానో అర్థం చేసుకుంటున్న విజయ్ వర్మతో చనువుగా ఉండటంలో తప్పేం లేదని తమన్నా చెబుతోంది. కొందరు పైకి ఒకలా మాట్లాడుతూ లోపల మరోలా ఉంటారని, కానీ విజయ్ వర్మ అలాంటి వాడు కాదని, తనకు గౌరవం ఇస్తాడని, బాగా చూసుకుంటాడని తమన్నా చెబుతోంది.
తాజాగా ఫొటో షూట్‌లో తమన్నా అందాల ప్రదర్శన చేసింది. యువతను, సోషల్ మీడియానూ ఆకట్టుకుంటూ ఫొటోలు అభిమానులతో పంచుకుంది. తమన్నా ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పోస్టు చేసిన గంటల్లోనే వేలాది లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. యూత్‌లో తమన్నా క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
Read Also : Tamannah item song: తమన్నా ఐటమ్ సాంగ్.. ఏఐ వెర్షన్‌లో ఎలా ఉంటుందంటే.. కట్టిపడేస్తున్న వీడియోలు!