Rashi Khanna: బ్లాక్‌ డ్రెస్‌లో అందాల రాశి.. లేటెస్ట్‌ హాట్‌ ఫొటోషూట్‌ వైరల్‌!

Rashi Khanna: టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ రాశి ఖన్నా. మొదట్లో కొంచం సంప్రదాయబద్ధమైన పాత్రలు, దుస్తులతో పద్ధతిగా కనిపించింది రాశిఖన్నా. తర్వాత సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. వెంటవెంటనే మూవీస్‌కి సైన్‌ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని హిట్లతో పాటు డిజాస్టర్లు కూడా రాశి ఖన్నా కెరీర్‌లో మూటగట్టుకుంది. ప్రస్తుతం కాస్త గ్లామర్ షో ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న రాశి ఖన్నా.. తాజాగా ఫొటో షూట్లతో హీటెక్కిస్తోంది. బ్లాక్‌ డ్రెస్‌లో పరువాల ఆరబోతతో యువత హృదయాలను కొల్లకొట్టేస్తోంది ఈ అమ్మడు.

Image

తన తొలి సినిమాతోనే అందరి దృష్టిలో పడిన రాశి ఖన్నా.. (Rashi Khanna) యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. సామాజిక మాధ్యమాల్లో హాట్‌ ఫొటో షూట్‌లను షేర్‌ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తోంది. హాట్‌ అందాల ఆరబోతను నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. తాజాగా షేర్‌ చేసిన ఫొటోల్లో బ్లాక్‌ డ్రెస్‌లో క్లివేజ్‌ షో ప్రదర్శించింది రాశి ఖన్నా. ఇప్పుడు ఈ చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కామెంట్లతో నెటిజన్లు జోరెత్తిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్యూటీ ఏంజిల్‌ అంటూ పలువురు యూజర్లు కామెంట్‌ చేస్తున్నారు.

Image

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అయితే, ఇటీవల రాశిఖన్నాకెరీర్‌ కాస్త స్తబ్ధుగా కనిపిస్తోంది. సినిమాల్లో అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. గతంలో ఆమె చేసిన పాత్రలకు మంచి ఆదరణ వచ్చినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బెంగాల్‌ టైగర్‌, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే.. లాంటి హిట్‌ చిత్రాల్లో రాశి ఖన్నా నటించింది. ప్రస్తుతం మూవీల్లో పెద్దగా కలిసిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ భామ సోషల్‌ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు అందాల ప్రదర్శనతో కూడిన చిత్రాలను, వీడియోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని తనవైపు మళ్లించుకొనే ప్రయత్నం చేస్తోంది.

లేటెస్ట్‌గా చేసిన ఫొటో షూట్‌లో కళ్లు చెదిరే పోజులిచ్చింది. నలుపు రంగు దుస్తులు ధరించి.. అందాలను చూపుతూ అదుర్స్‌ అనిపించింది. బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ వేసుకున్న రాశి.. అభిమానులను అలరించింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా పాల్గొంది. ఈ ఫొటోల్లో కాస్త బొద్దుగా అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె అందం మరింత పెరిగిందని కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ పరంగా కాస్త డోసు పెంచిందని చెబుతున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతుండడంతో రాశికి చాన్స్‌లు తగ్గి పోటీ తత్వం ఏర్పడింది.

Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్‌ హావభావాలు.. వీడియో క్లిప్స్‌ వైరల్‌!

Read Also : Tamannaah Bhatia: విజయ్‌ వర్మతో అందుకే చనువుగా ఉంటున్నా.. మిల్కీబ్యూటీ తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles