Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు సహజం అని, తనను 16 నెలలు జైల్లో పెట్టారని మాజీ సీఎం జగన్ (Jagan) గుర్తు చేసుకున్నారు. ఎవరూ చూడని వేధింపులు చూశానన్నారు. చీకటి తర్వాత వెలుగు సహజం అని స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ కు హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో జగన్ మాట్లాడారు.
’’పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో చేస్తేనే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మందికి ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి.
అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అన్నది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం, మనం చేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి.
చీకటి తర్వాత వెలుగు తప్పదు
కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు నేను చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్ధాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్ధానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్ధం అన్యాయం జరగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు.
ఆ విషయాలు గుర్తు పెట్టుకోవాలి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లోనూ, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకొండి.
మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్ధిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొండి. ఈ విషయాలను కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని వైయస్ జగన్ అన్నారు.
ఇవీ చదవండి: YS Jagan Meeting: సంస్థాగత నిర్మాణంతో దేశంలోనే బలమైన పార్టీగా ఎదగాలి
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్
YS Jagan on Mopidevi: మోపిదేవి పార్టీ వీడటంపై జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan Good Book: గుడ్ బుక్ రాస్తున్నాం.. ప్రమోషన్లు కల్పిస్తాం!
