AP News: అన్నమయ్య జిల్లా (Andhra Pradesh) రాజంపేట ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయమైన ఘటన వెలుగు చూసింది. జిల్లా ట్రెజరీ అధికారి మోహబూబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
(AP News) విచారణలో నలుగురు ఉద్యోగుల పేర్లు బయటపడడంతో సస్పన్షన్ వేటు వేశారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్ధీన్, అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్ లను సస్పెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. అటెండర్ విష్ణువర్థన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు కర్నూలు జిల్లాలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం ప్రదర్శించారు. కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధ్యతలు స్వీకరించగానే ఆలయం పేరుతో బ్యాంక్ లో సొంత ఖాతా తెరిచిన అధికారి.. ప్రత్యేక ఖాతాను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. భక్తుల కానుకలను సొంత ఖాతాలోకి అధికారి మళ్లించాడు.
రూ.కోటి 30లక్షలు సొంత ఖాతాలో డిపాజిట్ చేసుకున్నాడు.సిబ్బంది, బినామీల పేరుతో నగదు విత్ డ్రా చేస్తూ వచ్చాడు. బదిలీ అయ్యే సమయంలో బ్యాంక్ అకౌంట్ ను ఈవో క్లోజ్ చేశాడు. అధికారి బదిలీ అయ్యాక వాస్తవం వెలుగులోకి వచ్చింది. కోటికిపైగా డబ్బులు పక్కదారి పట్టినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భక్తులే చెబుతారు..
తిరుమల లడ్డూపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు వెళ్లాల్సిన పనిలేదు.. భక్తులను అడిగితే తెలిసిపోతుందని కామెంట్స్ చేశారు. లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేది భక్తులే చెప్తారని తెలిపారు. లడ్డూ నాణ్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గడిచిన ఐదేళ్లతో పోల్చితే ఇప్పుడు లడ్డూనాణ్యత బాగుందంటూ వ్యాఖ్యానించారు.
Read also: Devotional Tips work: పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ పనులు చేస్తే.. అంతా శుభమే!
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!
Devotional Tips Deepalu: దీపాలను ఆర్పే విధానం తెలుసా? అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పేయరాదు!
Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!
