Vijayawada: బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. పేకాడిన ఉదంతమిది. రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న బెజవాడ (Vijayawada) నగరంలో ఖాకీలు పేకాడిన ఘటన కలకలం రేపింది. దుర్గగుడిలో డ్యూటీ చేయటం కోసం వచ్చిన పోలీసులు.. హోటల్ లో పేకాడారు. నలుగురు సీఐలు పేకాటలో పాల్గొన్నట్లు వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టూ టౌన్ సీఐ కొండల రావు, పెను కొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐ లు పేకాట ఆడినట్లు తెలుస్తోంది. వీడియో ల పై పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు సమాచారం. సీఐ లపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
విజయవాడలో పోలీసుల నిర్వాకంతో ఒక్కసారిగా డిపార్ట్ మెంట్ లో కలకలం రేపింది. దుర్గగుడిలో విధుల కోసం వచ్చి పేకాడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు సీఐల వైఖరిని తప్పుపడుతున్నారు. పేకాటాడుతున్న టూటౌన్ సీఐ కొండలరావు,పెనుగొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం
అల్లూరి జిల్లాలో కూంబింగ్ లో ఉన్న సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ విద్యుత్ షాక్ తో మృతి చెందారు. డాంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టగూడెం అటవీ ప్రాంతం లో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఏఎస్ఐ తిరునావక్ అరసు మృత్యువాత పడ్డారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వీరకుట్టిపాల్యం కు చేసిన తిరునావ్ అరసు.. సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ లో విధులు నిర్వర్తించారు.
Read also: Devineni Avinash: రూ.534 కోట్ల దాతల సాయం దుర్వినియోగం
Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా: లోకేష్
Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!
CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టండి
