Devotional Tips Deepalu: వాస్తు శాస్త్రంలో అనేక అంశాలు మన జీవితాల్లో మార్పులు తెచ్చేవిగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పూజా సామగ్రికి సంబంధించిన అనేక కీలక అంశాలను వాస్తు శాస్త్రంలో పండితులు వివరించారు. ప్రకృతిలో శక్తులను బ్యాలెన్స్ చేయడంలో వాస్తు శాస్త్రం విశేష పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకూ ఓ ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా అగ్నేయ దిశను అగ్ని కోణం అని పిలుస్తారు. (Devotional Tips Deepalu)
అగ్నికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలున్నాయి. మనం ఎప్పుడూ అగ్నిని అవమానించరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అగ్నికి దేవతలతో సమానమైన విలువ ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం అగ్ని విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మన ఇంట్లో అగ్నికి సంబంధించిన అన్ని వస్తువులనూ అగ్ని మూలలోనే ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు ఎల్లప్పుడూ దీపాలను, కొవ్వొత్తులను లేదా అగ్గిపుల్లల వంటి వాటిని ఎలా పడితే అలా ఆర్పివేయకూడదని పండితులు సూచిస్తున్నారు. మన శరీరం నీరు, గాలి, ఆకాశం, భూమి, అగ్ని అనే పంచభూతాలతో నిర్మితమైందని పెద్దలు చెబుతారు. అగ్ని మన శరీరంలో నాలుగు శాతమే. మిగతా వాటి కంటే అతి తక్కువ పరిమాణంలో ఉందని చాలా మంది నమ్ముతారు. అగ్నికి మన జీర్ణవ్యవస్థకు దగ్గర సంబంధం ఉందట.
మనం వెలిగించిన దీపం లేదా కొవ్వొత్తి లేదా అగ్గిపుల్లను ఊది ఆర్పేస్తుంటాం. ఇలా చేయడం తప్పని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు అగ్గిపుల్లలను పాదాల కింద ఆర్పితే అరిష్టం సంభవిస్తుందట. వీటిని దూరంగా ఉంచి మంటను ఆర్పాలని చెబుతున్నారు. కానీ కాలికింద ఉంచి ఆర్పితే అగ్నిని అవమానించినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా అగ్నికి సంబంధించిన దీపాలు, గ్యాస్ స్టవ్, మైక్రో ఓవెన్లు, టోస్టర్లు, హీటర్ ఇలా అన్నీ ఆగ్నేయ భాగంలోనే ఉంచాలని చెబుతున్నారు. అలాంటప్పుడే ఎలాంటి అరిష్టాలు రాకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందే వరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారని పురాణాలు, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కానీ, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అది కూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితం అవుతోంది. నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నూనె దీపంతో మీరు మీ గృహంలో సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్నీ ఎలా సృష్టించుకోవచ్చు.
సంప్రదాయం పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం అని నిపుణులు చెబుతున్నారు. మనకు ఉన్న చాలా సమస్యల వలన మనం విద్యుద్దీపాలను ఆశ్రయిస్తున్నాం. కానీ దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడా కనిపిస్తుందని గమనించే ఉంటారు. దీపం ఉంటే భగవంతుడు ఉన్నట్లేనని చాలా మంది ప్రజలు, భక్తులు నమ్ముతారు. దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుంది. దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
Read Also : Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!