Devotional Tips work: ఇంట్లో నుంచి పని మీద బయటకు బయల్దేరేటప్పుడు రామ నామాన్ని తలచుకోవాలి. దానికి ఓ శ్లోకం కూడా ఉంది. శ్రీరామ రామేతి, రమే రామే మనోరమే. సహస్ర నామ తత్తుల్యం.. రామ నామ వరాననే.. ఈ శ్లోకాన్ని ఒక్కసారి తలచుకోవాలి. తర్వాత శ్రీరామ జయం.. శ్రీరామ జయం.. అని 11 సార్లు మనసులో తలచుకోవాలి. తర్వాత మీ గ్రామ దేవతను ఒక్కసారి భక్తిగా నమస్కారం చేసుకోవాలి. తర్వాత మీ కులదేవత పేరును ఒక్కసారి మనస్ఫూర్తిగా తలచుకొని ఇంట్లో నుంచి బయల్దేరాలి. (Devotional Tips work)
మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే.. ఆ పని విజయవంతంగా పూర్తి అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఒక వేళ ఆ పని సవ్యంగా జరగకపోతే డీలా పడిపోతూ ఉంటాం. ఆ ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. తీవ్రమైన చికాకుతో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు.. ఆధ్యాత్మికపరంగా కొన్ని పనులు చేయడం వల్ల బయటకు వెళ్తున్న పని దిగ్విజయవంతంగా పూర్తవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కావాల్సింది కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమేనని, కొన్ని నామ జపాలు చేయాలని సూచిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల ఏ పనులైతే మనం సవ్యంగా సాగాలనుకుంటామో.. అన్ని రకాల పనులూ దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్వం నుంచి వస్తోందని స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు విశేష ఫలితాలు కలుగుతాయంటున్నారు. బయటకు వెళ్లే ముందు.. మీ ఇంటి ఇలవేల్పును మొక్కుకోవాలని సూచిస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న గ్రామ దేవత యంత్రానికి నమస్కారం చేసుకోవాలి.
ఇలా చేస్తే విజయం వరించడం ఖాయం
గ్రామ దేవత, కుల దేవత, ఇలవేల్పు దేవతలకు ప్రత్యేకించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయకుండా ఎంత మంది దేవతలకు నమస్కారం చేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. తర్వాత బయల్దేరే ముందు ఇంట్లో భార్యకు వెళ్లొస్తానని చెప్పాలి. భార్య పాపిట ఉన్న సింధూరాన్ని ఒక్కసారి చూసి ఇక బయల్దేరితే విజయం మిమ్మల్ని వద్దన్నా వరిస్తుందని పెద్దలు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Vastu for house and money: ఇంట్లో వాస్తు దోషాలు, డబ్బు ఇబ్బందులా.. మంచి రెమెడీ ఇదే