Upcoming Telugu Movies: దసరా హాలిడేస్ సందర్భంగా చాలా మంది మూవీస్ ప్రియులు కొత్త సినిమాల కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారి కోసం రాబోయే సినిమాల (Upcoming Telugu Movies) లిస్టు ఇదీ.
వేట్టయాన్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమాలు తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆదరిస్తారు. ‘జైలర్’ సక్సెస్ తర్వాత రజనీ నటిస్తున్న మరో యాక్షన్ డ్రామా చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ లాంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. (Vettaiyan Release)
విశ్వం
గోపీచంద్ హీరోగా వస్తున్న మూవీ విశ్వం (Viswam Movie) పసందైన వినోదంతో పాటు అన్ని రకాల మసాలాలు అద్దుకుని పక్కా కమర్షియల్ ప్యాకేజ్‌గా వస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల కాస్త గ్యాప్ తర్వాత మాంచి కామెడీతో వస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద చెలరేగిన ఆయన.. ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’తో వస్తున్నారు. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మాణం చేశారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న (Viswam Movie Release) రిలీజ్ కానుంది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటిస్తోంది.
మార్టిన్
దసరా ఫెస్టివల్ బరిలో నిలిచిన మరో మూవీ ‘మార్టిన్’ (Martin Movie) ధ్రువ సర్జా (Dhruva Sarja) మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎ.పి.అర్జున్ తెరకెక్కించారు. వైభవి శాండిల్య హీరోయిన్. ఈ సినిమా అక్టోబర్ 11న (Martin Movie Release Date) వస్తోంది.
జిగ్రా
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా తెరకెక్కించిన చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie). ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, ఎటర్నల్ షైన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం అక్టోబర్ 11న (Jigra) థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి రిలీజ్ చేస్తున్నారు.
మా నాన్న సూపర్ హీరో
యువ హీరో సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర డైరెకక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఆర్ణ కథానాయిక. షాయాజీ షిండే కీలక పాత్రలో నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
జనక అయితే గనక
దసరా రేసులో ఉన్న మరో మూవీ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). నటుడు సుహాస్ ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి సిద్ధమయ్యారు. సంకీర్తన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ నిర్మాణం చేసింది. సందీప్ బండ్ల డైరెక్షన్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 12న (Janaka Aithe Ganaka Movie) రిలీజ్ అవుతోంది. ఆద్యంతం కామెడీ సీన్లతో ఉంటుందని ప్రమోషనల్ పిక్స్ చూసిన వారికి అర్థమవుతోంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవీ..
డిస్నీ+హాట్‌స్టార్
* సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11
* వారై (తమిళ) అక్టోబరు 11
నెట్‌ఫ్లిక్స్
* యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబర్ 8
* మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబర్ 10
* ఖేల్ ఖేల్ మే (హిందీ) అక్టోబర్ 9
* స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్) అక్టోబర్ 10
* టోంబ్ రైడర్: లారా క్రాఫ్ట్ (యానిమేషన్) అక్టోబర్ 10
* లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్) అక్టోబర్ 10
* ఔటర్ బ్యాంక్స్4 (వెబ్‌సిరీస్) అక్టోబర్ 10
* అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) అక్టోబర్ 11
* ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) అక్టోబర్ 12
* చుక్కీ (ఇంగ్లీష్) అక్టోబర్ 15
జియో సినిమా
గుటర్ గూ (హిందీ) అక్టోబర్ 11
టీకప్ (హాలీవుడ్) అక్టోబర్ 11
సోనీ లివ్
* జై మహేంద్రన్ (మలయాళం) అక్టోబర్ 11
* రాత్ జవాన్ హై (హిందీ) అక్టోబర్ 11
ఇవీ చదవండి: AP News: పురాతన ఆలయంలో భద్రపరిచిన నాణేలు మాయం
Vijayawada: విజయవాడలో పోలీసుల పేకాట.. వీడియో వైరల్
Devineni Avinash: రూ.534 కోట్ల దాతల సాయం దుర్వినియోగం
Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!
CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టండి
