HomeLife StyleSabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!

Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!

Sabja Ginjalu: వేసవి కాలంలో కూల్‌గా ఉండటం కోసం అనేక ప్రత్యామ్నాయాలు చూస్తుంటాం. కానీ మండే ఎండల కాలంలో సబ్జా గింజలను సరైన విధానంలో వినియోగించుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా సబ్జా గింజలు చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వేసవిలో ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

వెయిట్ లాస్
విటమిన్ కే, ఏ తో పాటు ఐరన్ ప్రోటీన్ ఫ్యాట్.. సబ్జా గింజల్లో అధికంగా లభిస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు, తగ్గాలనుకునే వారికి ఈ సబ్జా గింజలు చాలా బాగా పని చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మం కాంతివంతం..
మలబద్ధకం ప్రాబ్లమ్‌తో, గ్యాస్ సమస్యతో, అసిడిటి సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సబ్జా గింజలు వాడటం మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా వీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. స్కిన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే శరీరంలో జీవక్రియను కూడా వేగవంతం చేసి శరీరంలో ఉండే కొవ్వును సబ్జా గింజలు తగ్గిస్తాయి.

నానబెట్టి తీసుకోవాలి
సబ్జా గింజలు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి డ్రైగా ఉన్నప్పుడు అసలు తీసుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు. అలా తీసుకుంటే రాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. గొంతులో ఇరుక్కుపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సబ్జా గింజలను కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టి, ఆ తర్వాత 15 నిమిషాలకు అందులో కాసిన్ని చల్లటి నీరు కలిపి తాగాలి. ఎండకాలం వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. ఉదయం పరగడుపున తాగితే సరైన ఫలితాలను చూడొచ్చు. లేకపోతే ఏదైనా జ్యూసులలో వేసుకొని తాగినా కూడా మంచి ఫలితాలుంటాయి.

ఇవీ చదవండి: Sabja Ginjalu: ఈ వేసవిలో సబ్జా గింజలతో ఇలా చేయండి.. వేడి నుంచి తక్షణ ఉపశమనం గ్యారెంటీ!
Sabja Seeds: సబ్జా గింజలతో లాభాలు తెలుసా? చర్మ సమస్యలకు చెక్‌
Summer: భగభగలు.. ఏపీలోని బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Dandruff: డ్యాండ్రఫ్‌, చుండ్రుతో విసిగిపోతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం గ్యారెంటీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు