Back Bone: మన శరీరంలో ఎముకలు చాలా కీలకమైనవి. ఇవి మన శరీర నిర్మాణాన్ని సిద్ధం చేస్తాయి. ఎముకలు బలహీనమైనట్లు అనిపిస్తే మన శరీరం నొప్పికి గురవుతుంది. విపరీతమైన బలహీనత ఏర్పడుతుంది. దాంతోపాటు వెన్నెముక మన శరీరానికి చాలా ముఖ్యమైనది. బ్యాక్ బోన్ శరీరానికి కీలకమైనది. కానీ మన వయసు 30 సంవత్సరాలు పైబడిన తర్వాత అది కొద్దిగా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యను అరికట్టేందుకు మీరు వెన్నెముకకు మేలు చేసే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్‌లో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలా గుర్తించాలంటే..
మన వెన్నెముక కాస్త బలహీనపడిందని గుర్తించడం చాలా కీలకం. బ్యాక్ బోన్ బలహీనంగా అవడం ప్రారంభించినప్పుడు.. నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తుంటి నొప్పి, నడవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తాయి. చాలా సందర్భాల్లో చేతులు, కాళ్ళు తిమ్మిరి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కూడా గమనించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, వెన్నెముకను బలోపేతం చేయడానికి మీరు మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవాలి. మాంసాహారం తినడం వల్ల ప్రొటీన్ల అవసరం తీరిపోయినా, దీనివల్ల స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరుగుతాయనే భయం చాలా మందిని వెంటాడుతుంది.
మిల్క్ ప్రాడక్ట్స్..
పాలు, దాని ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మన ఎముకల బలానికి కీలకమైనది. దీని కోసం మనం పాలు, పెరుగు, జున్ను తీసుకుంటే సరిపోతుంది. అయితే.. కొవ్వు తక్కువ ఉన్న పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అది అధిక బరువుకు దారితీసే ఆస్కారం ఉందంటున్నారు.
వివిధ మూలికలు
30 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్నవారు వృక్ష వేర్ల భాగాలైన మూలికలు తీసుకోవడం ముఖ్యం. వీటిలో దాగున్న ఆయుర్వేద లక్షణాలు మన శరీరానికి, ఎముకలకు చాలా ఉపయోగపడతాయి. మనం రోజువారీ ఆహారంలో అల్లం, పసుపు, దాల్చిన చెక్క, అల్లం, తులసిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.. రోజుకు రెండుసార్లు హెర్బల్ టీని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
తాజా కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలను సూపర్‌ఫుడ్ గా పిలుస్తారు. ఎందుకంటే వాటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు కలిగిస్తాయి. బ్రకోలీ, కేల్, బచ్చలి కూరలను రోజువారీ ఫుడ్ మెనూలో చేర్చుకోవాలి. దీంతో వెన్ను మంట ఆగి, వెన్నునొప్పి సమస్య రాకుండా బ్యాక్ బోన్ మరింత స్ట్రాంగ్‌గా తయారవుతుంది.
ఇవీ చదవండి: YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
