Summer: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇటీవల నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో రేపు 169 మండలాల్లో వడగాలులు వీస్తాయని, వయసు పైబడిన వాళ్లు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా అర్థవీడులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వైయస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వేడి 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండలకు హైదరాబాద్ నగరం ఉడికిపోయింది. ఈ ఎండకాలంలోనే హైదరాబాద్ లో నేడు అత్యధిక టెంపరేచర్ నమోదు కావడం విశేషం. ఇవాళ రికార్డు స్థాయిలో హైదరాబాద్ నగరంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2015 మే 22 న రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, బండిఆత్మకూరులో 47.7 డిగ్రీలు నేడు నమోదైంది. అక్కమాంబపురం (నెల్లూరు జిల్లా)లో 47.1, పెద్దకన్నాలి (తిరుపతి)లో 46.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8 డిగ్రీలు, తవణంపల్లె (చిత్తూరు), రావిపాడు (పల్నాడు)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 208 మండలాల్లో వడగాల్పులు వీచాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
ఇవీ చదవండి: Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Sabja Ginjalu: ఈ వేసవిలో సబ్జా గింజలతో ఇలా చేయండి.. వేడి నుంచి తక్షణ ఉపశమనం గ్యారెంటీ!
Reducing body heat: శరీరంలో వేడి తగ్గడానికి ఏం చేయాలి? ఎలాంటి ద్రవాలు తీసుకోవాలంటే..
Perni Nani on Kollu Ravindra: బందరులో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి!
Body Heat: శరీరంలో వేడి ఎందుకు చేస్తుంది? నష్టాలేంటి? బాడీలో హీట్ తగ్గాలంటే ఏం చేయాలి?
Summer Heat: ఏపీలో భానుడి భగభగలు.. కొమరాడలో 45.8 డిగ్రీలు నమోదు
