ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Life Style

Sabja Seeds: సబ్జా గింజలతో లాభాలు తెలుసా? చర్మ సమస్యలకు చెక్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 30 మే 2023

Sabja Seeds: వేసవి కాలంలో చాలా మంది సబ్జా గింజలను (Sabja Seeds) వాడుతుంటారు. సబ్జా గింజలను నానబెట్టుకొని జ్యూస్‌లలో, పాలలో, నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గి రక్తప్రసరణకు వీలవుతుంది. దీంతోపాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సబ్జా గింజలను పలు రకాల ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.

బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని సబ్జా గింజలు (Sabja Seeds) ఇస్తాయి. యాంటీబయాటిక్‌లా కూడాపని చేస్తాయి. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరి నీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా సబ్జా గింజల్ని తీసుకోవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలు చర్మ సమస్యల్ని కూడా అరికడతాయి. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి.

Super Cool Sabja: An Antidote to Summer Heat

ముఖ్యంగా చర్మ సమస్యలు నివారించడంలో సబ్జా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతుందని చెబుతున్నారు. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ఈ కూడా ఇందులో లభిస్తుంది. సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, సాల్మన్‌ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్‌, గుండె సంబంధ వ్యాధుల నివారణలో సబ్జా గింజలు తోడ్పడతాయని చెబుతున్నారు.

సబ్జా గింజలు జిగురులా ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచడం వీటి ప్రత్యేకత. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు సబ్జా గింజలు రోజూ తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంపై ఏదైనా దెబ్బలు తగిలిన సందర్భాల్లోనూ మానిపోవడానికి సబ్జా గింజలు వినియోగించుకోవచ్చు. సబ్జా గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవడం వల్ల త్వరగా నయం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహులకు ఎంతో ఉపయుక్తం..

షుగర్‌ వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే డయాబెటిస్‌ కంట్రోల్‌లోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహం నుంచి ఉపశమనం పొందగలుగుతారని చెబుతున్నారు. మధుమేహం కలిగిన వారు తీసుకొనే ఆహారంతో పాటు ఇలాంటి కొన్ని సూచనలు పరిగణనలోకి తీసుకుంటో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా తేలిక అని నిపుణులు చెబుతున్నారు.

22 Hidden Basil Seeds (Sabja Seeds) Benefits For Health, Weight Loss, Skin  & Hair

సబ్జాలో మరెన్నో ఆరోగ్య రహస్యాలు…

తరచూ డీహైడ్రేషన్‌కు కొందరు గురవుతుంటారు. ఇలాంటి వారికి సబ్జా గింజల పానీయం దివ్యౌషధంగా పని చేస్తుంది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండేందుకు వీలు కలుగుతుంది. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఎప్పుడైనా అనిపించినప్పుడు సబ్జా గింజల పానీయం తాగడం వల్ల వెంటనే ఉపశమనం పొందగలుగుతారు. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు సబ్జా గింజలు నానబెట్టుకొని నీళ్లలో కలిపి తాగడం వల్ల దూరమవుతాయి.

ఓ గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం మన ఇంట్లో పిల్లలకు తాగించడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. చిన్నారులకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఈ లాంటి పోషకాలు దక్కుతాయి. ఇవి మహిళలకు ఎంతో ఉపయుక్తం, అవసరం కూడా. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగినట్లయితే శ్వాసకోస వ్యాధులు ఉన్న వారికి బెస్ట్‌ ఉపశమనం పొందొచ్చు.

Read Also : Good Health Tips: రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్య చిట్కాలివే..

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading