AP New DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పోలీసు డైరెక్టర్ జనరల్‌గా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. గత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముగ్గురు పేర్లతో సీఎస్.. ఈసీకి నోట్ పంపారు. వీరిలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయి. అయితే, ఈసీ మాత్రం హరీష్ కుమార్ గుప్తావైపే మొగ్గు చూపింది.
నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు వేసింది ఈసీ. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇవాళ సాయంత్ర 5 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశం ఉండటంతో ఆ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా.. ఇప్పుడు డీజీపీగా నియమితులయ్యారు.
కొత్త డీజీపీ నియామక ప్రక్రియ నిన్న, ఈరోజు పూర్తి అయ్యింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ఈసీకి సీఎస్ ప్రతిపాదనలు పంపారు. వీరిలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. 1989, 1991, 1992 బ్యాచ్ లకు చెందిన డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకారంతో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆయన ఆధ్వర్యంలో కొనసాగనుంది.
ఇవీ చదవండి: Andhra Pradesh: మొన్న పింఛన్.. నేడు డీబీటీ నిధులకు అడ్డంకులు.. దీని ఫలితమేమి రామచంద్రా!
YSR Pension Kanuka: ఏపీలో రూ.3,000కు పెరిగిన పింఛన్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్ సర్కార్
Palnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్ అవార్డులు
DGP on punganuru incident: పుంగనూరు ఘటనలో ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేశాం : డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
Manipur DGP: మణిపూర్ డీజీపీ తమ ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశం
