HomeAndhra PradeshPM Modi in Vemagiri: చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నంబర్‌ వన్: ప్రధాని మోదీ

PM Modi in Vemagiri: చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నంబర్‌ వన్: ప్రధాని మోదీ

PM Modi in Vemagiri: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్దిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు. కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. వేమగిరి కూటమి బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏమన్నారంటే..

గోదావరి మాతకు ప్రణామాలు. ఈ నేల మీదే ఆదికవి నన్నయ తొలి కావ్యం రాశారు. ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాం. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్డీఏదే అధికారం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారం. ఈ ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిందఇ. చంద్రబాబు సమయంలో అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉండేది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పింది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవు. ఈ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వంద శాతం. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. కేంద్ర ప్రాజెక్టుల అమలును ఈ ప్రభుత్వం జాప్యం చేసింది.

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసింది. ఈడీ.. ఈడీ అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ నేతల వద్ద ఉన్న గుట్టల కొద్దీ డబ్బు బయటపడుతోంది. కాంగ్రెస్ నేతల డబ్బులు మిషన్లు కూడా లెక్కపెట్టలేక పోతున్నాయి. ఝార్ఖండ్ కాంగ్రెస్ నేతల వద్ద కట్టల కొద్ది డబ్బు దొరికింది. కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఎందుకు గుట్టలుగా డబ్బు దొరుకుతోంది.

గుట్టల కొద్దీ డబ్బుపై కాంగ్రెస్ రాకుమారుడు జవాబు చెప్పాలి. దోచుకున్న డబ్బు తెచ్చి ఎలా పేదలకు పంచాలో ఆలోచిస్తున్నా. సమస్యలను అవకాశాలుగా ఓటుతో మార్చుకోవచ్చు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్ గా మారారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ తో పరిగెత్తింది. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒకటీ చేయలేదు. మూడు రాజధానులు పేరిట ఏపీని లూటీ చేశారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప ఆర్థిక నిర్వహణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైకాపా ప్రభుత్వం ఖాళీ చేసింది. రాజధానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని భావించింది. పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది. కేంద్ర నిధులను ఈ సర్కారు అందుకోలేకపోయింది. ఢిల్లీ – ముంబై కారిడార్ మాదిరిగా విశాఖ – చెన్నై కారిడార్ నిర్మాణం. చెన్నై – కోల్ కతా హైవే, రాజమండ్రి విమానాశ్రయం ఈ ప్రాంతం ముఖచిత్రం మారుస్తాయి.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర ఉన్న భూమి. రాముడు చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్ ఇంటింటికి తీసుకెళ్లారు. అయోధ్య రాముడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రాణ ప్రతిష్టకు వచ్చిన ఒక నేతను కాంగ్రెస్ బహిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి. ఏపీకి మోదీ గ్యారెంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయి. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి. అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్‌ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
CBN Comments on Modi: అబ్బబ్బ.. అవేం పొగడ్తలు.. తిట్టిన నోటితోనే ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు