HomeAndhra PradeshNHRC visit AP: 6న జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న

NHRC visit AP: 6న జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న

NHRC visit AP: మార్చి 6వ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నిర్వహించే క్యాంపు సిట్టింగ్ కు విజయవాడలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ డిల్లీరావు పర్యవేక్షించారు. డిల్లీరావు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రానికి సంబంధించి కేసుల విచారణకు క్యాంపు సిట్టింగ్ నిర్వహించనున్నదన్నారు.

మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా, సభ్యులు డిఎం. ములే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని హాజరుకానున్నార న్నారు. ఈ శిబిరంలో పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకుల ప్రతినిధులతో కమిషన్ సమావేశం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర అధికారులు, సంబంధిత ఫిర్యాదుదారులు కేసుల విచారణకు హాజరు కానున్నారన్నారు.

* 6న బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు క్యాంప్ సిట్టింగ్ లో కేసుల బహిరంగ విచారణ
* మధ్యాహ్నం 12.30 గంటల నుండి 01.30 గంటల వరకు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సమావేశం,
* తిరిగి 2.30 గంటల నుండి 03.30 గంటల వరకు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పౌర స‌మాజ సంస్థ‌లు (సిఎస్ వో లు), స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), హ్యూమన్ రైట్స్ ఢిఫెండర్స్ (హెచ్ఆర్ డీ) ల‌తో ముఖాముఖి.
* 3.30 నుండి 4.00 గంటల వరకు పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తారు.

ఇవీ చదవండి: CM Jagan Humanity: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధుడి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్‌
Yamalokam: మానవుడు చేసే నేరాలకు నరకంలో ఏ శిక్షలుంటాయి? తప్పక తెలుసుకోండి..
Manipur Violence: మానవత్వమా నీ వెక్కడ? మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులు.. మణిపూర్‌ హింసలో ఆలస్యంగా వెలుగులోకి!
Blood facts: మనిషి ఒకసారి ఎంత రక్తదానం చేయాలి? స్త్రీ, పురుషుల్లో ఎంత రక్తం ఉండాలి?
Everest: ఎవరెస్ట్‌ పర్వతారోహకులకు వింత అనుభవాలు.. మల వ్యర్థాలతో కంపు కొడుతున్న మంచుకొండలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు