Everest: ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. పర్యాటకులతో ఎవరెస్ట్ మంచుకొండలు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. అయితే, ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లాలనుకొనే వారికి ఒక షాకింగ్ న్యూస్ ఇది. మల వ్యర్థాలతో పర్వత ప్రాంతాలు, మంచుకొండలు కంపు కొడుతున్నాయట. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పర్వతారోహకులు విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో తీసుకురావాలంటూ నిబంధనలు విధించారట. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Everest
ఎవరెస్ట్ పర్వతారోహకుల మల విసర్జనలతో ఎవరెస్ట్ శిఖరం కంపు కొడుతోందట. విపరీతంగా పేరుకుపోతున్న మల, ఇతర వ్యర్థాల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుందట.
ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారట.
సదరు మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా ఈ కొత్త నిర్ణయం గురించి వెల్లడించారు. విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల పర్వతాలపై మల విసర్జన పెరిగిందట. దీంతో పర్వతాల్లో దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. దీనివల్ల కొంత మంది పర్వతారోహకులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ పరిస్థితి చాలా దారుణమని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారుతుందన్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించాలనుకునే పర్వతారోహకులు.. రసాయనాలతో కూడిన ప్రత్యేక మల సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా సూచించారు. వారు బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తప్పనిసరిగా పరిశీలిస్తారు. ఈ చర్య ద్వారా ఎవరెస్ట్ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడి వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడగలుగుతామని ఆయన వెల్లడించారు.
Read Also: Rivers in India : భారతదేశంలో నదులు, వాటి పేర్లు.. సంస్కృతిని ప్రతిబింబించే ద్వీపకల్ప నదులు
East Door Vastu: తూర్పు దిశ తలుపు ఉంటే పరమ పవిత్రం.. వాస్తు బాగా కలిసొచ్చేది ఇదే..
Sleeping sides: ఉత్తరంవైపు తల పెట్టి ఎందుకు పడుకోరాదు? పెద్దలు ఏం చెబుతున్నారంటే..
Yamalokam: మానవుడు చేసే నేరాలకు నరకంలో ఏ శిక్షలుంటాయి? తప్పక తెలుసుకోండి..
Chinni Krishna: అన్నయ్యా నన్ను క్షమించు.. మెగాస్టార్‌పై నోరుపారేసుకొని చివరకు క్షమాపణ చెప్పిన చిన్నికృష్ణ
