Allam Vellulli Price: అల్లం వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడికి అందనంత ఎత్తులో అల్లం, వెల్లుల్లి ధరలు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర రూ.500 మార్క్ దాటింది. అటు అల్లం కూడా కిలో రూ.300 నుంచి రూ.350 వరకు చేరింది. ఇప్పుడు వెల్లుల్లి గడ్డలు బహిరంగ మార్కెట్‌లో కిలో ధర రూ.500కు పెరిగింది.
పంట పొలాల్లో సీసీ కెమెరాలు..
ధరలు పెరిగిపోవడంతో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. పంట పొలాల నుంచే వాటిని కొందరు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం రైతన్నలు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.
ఇంతగా పెరగలేదు..
గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని అన్నదాతలు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు. కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయం ఉందంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో దాదాపు 1,500 హెక్టార్ల భూమిలో వెల్లుల్లి పంటను పండిస్తుంటారు.
ఆ జిల్లాలో ఉద్యాన పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30 హెక్టార్లు దాకా ఉంటుంది. 2023లో వెల్లుల్లికి మంచి ధర రాకపోవడంతో రైతులు పంట వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. సగటు ఉత్పత్తి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Vitamin C: విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు ఇవే.. ఈ కూరగాయలు తింటే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందంటే..
Vitamin D sun: మన దేహానికి రోజూ ఎన్ని నిమిషాలు ఎండ తాకాలంటే.. విటమిన్ డితో పాటు ఎన్నో ప్రయోజనాలు
Beetroot: బీట్‌రూట్‌తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఏయే విటమిన్లు ఉంటాయంటే..
Sunset: ఉదయం, సాయంత్రం ఏ సమయంలో ఎండలో ఉండాలి? విటమిన్ డి పొందే విధానాలు..
Non Veg: మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రోటీన్లు లభిస్తాయి? ఏయే విటమిన్లు పొందవచ్చు?
