HomeAndhra PradeshVision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ

Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ

Vision Vishakha: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖ నగరమని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాడిసన్ బ్లూ హోట్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాష్ట్ర అభివృద్ధి, విశాఖ నగర ప్రాముఖ్యత, ఈ నగరానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తు గురించి చర్చిస్తారని మంత్రి తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల సర్వతో ముఖాభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయనున్నారని తెలిపారు. పరిశ్రమలు, పర్యాటకం, హాస్పిటల్స్, హోటల్స్, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు చెందిన సుమారు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలియజేశారు. విశాఖపట్నం విజన్ డాక్యుమెంటును ముఖ్యమంత్రి వీరికి తెలియజేయునన్నారని అమర్నాథ్ వివరించారు. విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు.

దేశంలోని ప్రముఖ నగరాలకు దీటుగా, ఈస్ట్ కోస్ట్ కు గేట్ వే గా విశాఖను తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలలో కల్పించిన మౌలిక సదుపాయాల గురించి, విశాఖ నగరంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాల గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తారని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి కూడా అతిధులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారని అమర్నాథ్ తెలిపారు.

ఎన్.టి.పి.సి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్బును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని, 15 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అమర్నాథ్ తెలిపారు. అలాగే విశాఖకు వచ్చిన బల్క్ డ్రగ్ పార్కు గురించి, ఫార్మా రంగంలో ఈ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరిస్తారని చెప్పారు.

ఇది ఇలా ఉండగా ప్రపంచ స్థాయి మాల్స్ కూడా విశాఖలో అడుగుపెట్టనున్నాయని, ఇందులో భాగంగానే ఇనార్బిట్ మాల్ రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే విశాఖ నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, త్వరలోనే మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయని అన్నారు.

పర్యాటక రంగంలో మరికొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా విశాఖకు రానున్నాయని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా విశాఖలో ఫ్లైఓవర్, మెట్రో సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తారని అమర్నాథ్ చెప్పారు.

రూ.1500 కోట్ల జీవీఎంసీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలతో ముడసర్లోవ లో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

అలాగే సుమారు 9 నుంచి 10 కోట్ల రూపాయలతో టెర్టెల్ బీచ్ ను ఏర్పాటు చేయనున్నారని దీనికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అమర్నాథ్ తెలియజేశారు. వెంకోజీ పాలెం నుంచి మారియట్ హోటల్ వరకు నిర్మించనున్న ఆల్టర్నేటివ్ డబల్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి తెలియజేశారు.

మధురవాడకు కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లై ప్రాజెక్టుకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని అన్నారు. కాగా రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నికల్ కళాశాలల అభివృద్ధికి సంబంధించి భవిత పేరుతో చేపట్టనున్న అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తెలియజేస్తారని, అలాగే రూ.98 కోట్లతో అభివృద్ధి చేసిన ఐ.టి.ఐ లు, పాలిటెక్నిక్ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

ఇవీ చదవండి: CM Jagan Meeting with Officials: విశాఖపట్నం వయా ఉమ్మడి కర్నూలు మీదుగా కడపకు హైస్పీడ్‌ రైళ్ల కోసం ఒత్తిడి తీసుకురావాలి
Vizag boat Fire Accident: సీఎం జగన్‌ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం
25th ICID Congress Plenary: విశాఖలో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ పై 25వ అంతర్జాతీయ సదస్సు
CM Jagan in Vizag: దసరా ముహూర్తం.. విశాఖ నుంచే పాలనకు జగన్‌ సంసిద్ధం
Vizag Inorbit mall: విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇది: సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు