HomeAndhra PradeshHigh court on Lokesh: సమస్యలు సృష్టిస్తుంటే అనుమతులు రద్దు చేయండి.. లోకేష్‌ పాదయాత్రపై హైకోర్టు...

High court on Lokesh: సమస్యలు సృష్టిస్తుంటే అనుమతులు రద్దు చేయండి.. లోకేష్‌ పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High court on Lokesh: టీడీపీ యువ నేత నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. యువగళం పేరిట ఆయన రోడ్లపైకొచ్చారు. తొలుత స్తబ్దుగా మొదలైన ఆయన పాదయాత్ర.. తర్వాత జనంలో స్పందన లేక వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు లోకేష్‌. (High court on Lokesh)

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్యకర్తలను ఉసిగొల్పుతూ ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తామంటూ కాంట్రర్సీ కామెంట్స్‌ చేశారు. దీనిపై అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. రెచ్చగొట్టేందుకు మాత్రమే పాదయాత్ర పేరిట లోకేష్‌ ఇలా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా లోకేష్‌ తీరుపై ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రెచ్చగొట్టేందుకే లోకేష్‌ పాదయాత్ర పెట్టుకున్నారని ఏఏజీ సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. యాత్ర సందర్భంగా లోకేష్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మందలపర్రులో చర్చి వైపు చూపించడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని తెలిపారు. ప్రార్థనలు చేస్తున్న వారిని చావగొట్టారని ఏఏజీ సుధాకర్‌ రెడ్డి వాపోయారు. ప్రభుత్వం తరఫున ఈ విషయాలన్నీ ఏఏజీ సుధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, సమస్యలు సృష్టిస్తుంటే యాత్రకు అనుమతులు రద్దు చేయండి అంటూ ప్రభుత్వానికి సూచించింది.

Read Also : Rain Alert Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, రోడ్లు జలమయం

Vyooham: వ్యూహం రిలీజ్‌పై ట్విస్ట్‌.. లోకేష్‌ అభ్యంతరాలు.. సెన్సార్‌ బోర్డులో అడ్డంకులు.. ఆర్జీవీ మాస్‌ రిప్లయ్‌!

TANA: తానా సభల్లో ఇరువర్గాల డిష్యుం డిష్యుం.. అసలేం జరిగింది? లోకేష్‌, తారక్‌ అభిమానుల కొట్లాటేనా?

CM Jagan at Nethanna Nestham: వాలంటీర్ల గురించి వీళ్లా మాట్లాడేది..? పవన్‌ నుంచి లోకేష్‌, బాలయ్య వరకు దుమ్ము దులిపేసిన జగన్‌

Chandrababu and Lokesh: చంద్రబాబు, లోకేష్‌కు న్యూస్‌ స్పేస్‌ తగ్గిపోయిందా? జనసేనాని డామినేషన్‌ చేస్తున్నారా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు