HomeAndhra PradeshWeather today 06-09-2023: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Weather today 06-09-2023: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Weather today 06-09-2023: పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో ఒడిషా, ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం తీరాన్ని దాటే అవకాశం ఉంది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. (Weather today 06-09-2023)

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తీరం వెంబడి గంటకు 45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇవాళ, రేపు మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో వచ్చే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏపీలో వచ్చే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు తప్పవన్నారు. పార్వతీపురం, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read Also : Rain Alert Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, రోడ్లు జలమయం

CEO Andhra: దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు.. కీలక అప్‌డేట్స్‌ వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు