TANA: అమెరికాలో కొందరు తెలుగు వ్యక్తులు సిగపట్లు పట్టారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (TANA) 23వ మహాసభలు ఇందుకు వేదికయ్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ఇరు వర్గాలు ఘర్షణకు దిగడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. యూఎస్‌లోని ఫెలడెల్ఫియాలో ఉన్న పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈనెల 7, 8, 9 తేదీల్లో తానా సభలు జరిగాయి.
ఈ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వెళ్లారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, పలువురు సినిమా నటులు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పలువురు ప్రముఖులు వెళ్లారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీతక్క తదితరులు హాజరయ్యారు. (TANA)
ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభలో తాజాగా పలువురు పరస్పరం కొట్టుకోవడం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో అసలేం జరిగిందనే ఆసక్తి నెలకొంది. వైరల్ అయిన వీడియోల ప్రకారం.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రెసిడెంట్ కోమటి జయరామ్ సమక్షంలోనే ఈ గొడవ జరిగిందట.
Read Also : NTR Heroine: తారక్ హీరోయిన్ ను తొక్కేయడం వెనుక అంత కథ జరిగిందా?
ఈ రగడకు సంబంధించిన వీడియోలను ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన సోషల్ మీడియాలో (YSRCP Social Media) తొలుత దర్శనం ఇచ్చాయి. అందులో… కొందరు జై ఎన్టీఆర్ (Jr NTR) నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న నారా లోకేష్ (Nara Lokesh) అభిమానులు గొడవకు దిగారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం (TDP NRI WING) అధ్యక్షుడు కోమటి జయరాం (Komati Jayaram) సమక్షంలోనే కొట్లాట జరిగిందని వివరించారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ రచ్చ చేశారని పేర్కొన్నారు.
తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా 😡 https://t.co/R06P8Gq7bK
— BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023
తాజాగా ఈ వీడియోపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) రెస్పాండ్ అయ్యారు. గొడవకు సంబంధించిన వీడియోలపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘తానా పరువు తీస్తున్నారు కదా.. దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా…’ అంటూ బండ్ల గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. మరో వైపు ఈ సభలకు వచ్చిన వారు తమకు భోజనం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కడో ఖండాలు దాటి వెళ్లినా కూడా కొందరిపై శృతిమించిన అభిమానం, ఎదుటి వ్యక్తిపై ఏహ్యభావంతో ఇలా గొడవలకు దిగడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also : NTR: క్లాస్ అండ్ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!