Vyooham: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం వ్యూహం. తెలుగు రాష్ట్రాల్లో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలపై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం వైయస్ జగన్ పాత్రలను ప్రముఖంగా షూట్ చేశారు. పాత్రల ఎంపికలో గట్టి పట్టున్న ఆర్జీవీ.. అచ్చు గుద్దినట్లు వైయస్ జగన్, చంద్రబాబు పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు. నిజజీవితంలో వీరి పాత్రలకు దగ్గరగా ఉన్న కథను, అచ్చం వీరి పేర్లను, పార్టీ పేర్లను కూడా ఉపయోగించారు. దీంతో అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. (Vyooham)
ట్విస్ట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తప్పలేదు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది. దీంతో ఆర్జీవీ బృందం ఒక్కసారిగా అవాక్కయ్యింది. సినిమాలో వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలను కించపరిచేవిధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు పేర్కొంది. వ్యూహం సినిమా రాజకీయ వివాదాలను సృష్టించే విధంగా ఉందంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది.
భయం లేదంటూనే ముందే లోకేష్ ఫిర్యాదు!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఏపీ సీఎం వైయస్ జగన్ అంటే తనకు భయం లేదని టీడీపీ నేత నారా లోకేష్ పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే, అందుకు భిన్నంగా ఆర్జీవీ వ్యూహం మూవీకి లోకేష్ భయపడినట్లు జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆర్జీవీ వ్యూహం మూవీపై అక్టోబర్ 30న సీబీఎఫ్‌సీ ప్రాంతీయ అధికారికి నారా లోకేష్ లేఖ రాశారు.
సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని లేఖలో పేర్కొన్నారు లోకేష్.చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా తీశారని లోకేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. టీడీపీని కించపరిచేలా సినిమా ట్రైలర్ ఉందని ప్రస్తావించారు. ఇది సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పుకొచ్చారు.
మరోవైపు సెంట్రల్ సెన్సార్ బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ లేఖ కూడాలేఖ రాశారు. సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉన్న జీవితా రాజశేఖర్ ను వ్యూహం సినిమాకు దూరంగా ఉంచాలని నట్టి కుమార్ కోరారు. వ్యూహం సినిమాపై రివ్యూ కమిటీకి బోర్డు రిఫర్ చేసింది. మరోవైపు నవంబర్ 10న వ్యూహం సినిమా విడుదల చేసేందుకు వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు.
నేను ఎవరికీ భయపడనని నీకు మాత్రమే తెలుసు..
సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్‌లో ఆయన పోస్టులు పెడుతూ.. పుష్ప మూవీలో అల్లు అర్జున్ డైలాగ్‌లను ఎడిట్ చేసి పోస్టు చేశారు. సునీల్‌తో మాట్లాడుతున్న క్లిప్పింగ్‌లో డైలాగులను తనకు అనుకూలంగా మార్చి పోస్టు చేశారు. నేను ఎవరికీ భయపడనని నీకు మాత్రమే తెలుసు.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఎవరికి తగలాలో వారికి తగిలేట్టుగా వర్మ బాణాలు వేశారు.
నా వ్యక్తిగత అభిప్రాయం.. సెన్సార్ ఔట్‌డేటెడ్..
ఎల్లోమీడియా బ్యాచ్ రకరకాలుగా సినిమా సెన్సార్ గురించి మాట్లాడుకుంటున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫై మాత్రమే చేస్తుంది కానీ సినిమాను ఆపలేదని స్పష్టం చేశారు. వ్యూహం సినిమాను ఆపటానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి నేను ఒక్కటే చెబుతున్నాను.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. ఇక్కడ సెన్సార్ వాళ్లు రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు.. రివైజింగ్ కమిటీ చెప్పింది చేస్తాం.. అని వర్మ పేర్కొన్నారు. సెన్సార్ అవుట్ డేటెడ్ సిస్టమ్ అని నా పర్సనల్ ఒపీనియన్ అన్నారు.
వ్యూహంలో నా వ్యూహం లేదన్నారు వర్మ. వైఎస్సార్ మరణం సమయంలో ఎవరి వ్యూహాలు వారు పన్నారని తెలిపారు. తనకు తెలిసినవి వ్యూహం సినిమా ద్వారా చెబుతున్నానని, తాను నమ్మినదానిని సినిమా తీస్తున్నానని వర్మ క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Buggana Rajendranath: మా హయాంలో చేసిన అప్పు రూ.1,36,508 కోట్లే.. కాగ్ నివేదికలనూ తప్పుపడతారా? బుగ్గన ఫైర్