సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Tollywood Beauty : నేను ప్రేమించిన వ్యక్తికి పెళ్లయిపోయింది.. బిగ్ బాస్ బ్యూటీ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 10 జూలై 2025

Tollywood Beauty : టాలీవుడ్‌లో బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి దివి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తన ఆటతీరుతోనే కాకుండా గ్లామర్ టచ్‌తో కూడా హౌస్‌లో ప్రేక్షకులను అలరించిన దివి, గెలుపొందకపోయినా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. (Tollywood Beauty)

ప్రస్తుతం దివి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండి, తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో సందడి చేస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి, తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యింది. “నేను ఎంతగా ప్రేమించిన అబ్బాయికి ఇప్పుడు పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఎంతో హ్యాపీగా జీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే, మనం ఇష్టపడిన వ్యక్తి సంతోషంగా ఉండడం కోరకుంటాం కదా… అంతకన్నా ఇంకేం కావాలి?” అని చెప్పింది.

ఇక ఆ వ్యక్తి పేరును మాత్రం దివి బయటపెట్టలేదు. అయితే అతని కుటుంబ సభ్యులు తానిపట్ల మంచి అభిమానం చూపించేవారట. కానీ, వారి మధ్య సంబంధం మాత్రం వర్కవుట్ కాలేదని ఆమె చెప్పింది.

ఇప్పుడు దివి టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ దూసుకుపోతోంది. గతేడాది ‘లంబసింగి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దివి, ‘సింబా’, ‘పుష్ప 2’ లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించింది. ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జాట్’ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో అలరించింది.

దివి ఇలా తన ప్రేమ విషాదాన్ని అభిమానులతో పంచుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

View this post on Instagram

ఇవీ చదవండి: Andrea Jeremiah : టాలీవుడ్ తారకు అరుదైన వ్యాధి.. తెల్లమచ్చలతో!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో మొదలైన ప్రేమకథ.. ఎంగేజ్‌మెంట్ వరకు.. జాన్వీ సోదరి

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading