HomeCinemaAndrea Jeremiah : టాలీవుడ్ తారకు అరుదైన వ్యాధి.. తెల్లమచ్చలతో!

Andrea Jeremiah : టాలీవుడ్ తారకు అరుదైన వ్యాధి.. తెల్లమచ్చలతో!

Andrea Jeremiah : ఈ మధ్య కాలంలో సినీ తారలు తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించడానికి వెనుకాడటం లేదు. ఇటీవల సినీతారల తమ వ్యక్తిగత సమస్యలు బయటపెట్టేందుకు అసలు చింతిచడం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తమ సమస్యలను ఇబ్బంది పడకుండా చెప్పేసుకుంటున్నారు. ఈ కోవలో మరో తార (Andrea Jeremiah) చేరింది.

ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సఫర్ అవుతున్నట్లు స్టార్ హీరోయిన్ సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఈ షాకింగ్ విషయం చెప్పడంతో ఆమెకు పరామర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చికిత్స గురించి కూడా సమంత అప్ డేట్లు ఇస్తూ వచ్చింది.

తాజాగా మరో టాలీవుడ్ తార కూడా అరుదైన వ్యాధితో సఫర్ అవుతున్నట్లు పేర్కొంది. హీరోయిన్ ఆండ్రియా జెరెమియా ఈ మేరకు సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా ఆసక్తికర విషయాలు తెలిపింది. సింగర్ గా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. కథానాయికగా మారి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగుగో పాటు తమిళం, మలయాళం, హిందీ, భాషల్లోనూ తన నటనతో ఆడియన్స్ కు దగ్గరైంది.

అన్న యమ్ రసూల్ మూవీతో మలయాళీ మూవీ ఇండస్ట్రీలోకి జెరెమియా ఎంట్రీ ఇచ్చింది. లోహం, లండన్ బ్రిడ్జ్, థోపిల్ జోప్పన్ వంటి మూవీల్లోనూ ఆండ్రియా నటించింది. కెరీర్ మంచి దూకుడు మీద ఉన్నప్పుడు నటనకు గుడ్ బై చెప్పిన ఈ భామ.. చివరిసారిగా ఆమె నటించిన చిత్రం వడ చెన్నై. తమిళ ల్యాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా చెబుతూ.. వడ చెన్నై సినిమా తర్వాత తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం మొదలైందని వెల్లడించింది.

ఉదయం నిద్ర లేచే సమయానికి శరీరంపై చాలా మచ్చలు కనిపిస్తాయని ఆండ్రియా తెలిపింది. రక్త పరీక్షలో వ్యాధిని గుర్తించలేదని, ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడి అనుకుంటున్నానని తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతూ సినిమాలకు దూరమయ్యానని పేర్కొంది. అయితే, లవ్ ఫెయిల్యూర్ తో సినిమాలకు దూరమయ్యానంటూ తనపై మీడియాలో వార్తలు రావడం బాధించిందన్నారు. తన వ్యాధికి సంబంధించి.. అనేక మచ్చలు ఇప్పటికీ శరీరంపై ఉన్నాయని తెలిపింది. ఇంకా కనురెప్పలు తెల్లగా ఉన్నాయని, ఇందుకు ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆండ్రియా కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవీ చదవండి: Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు