HomeCinemaAnshula Kapoor: డేటింగ్ యాప్‌లో మొదలైన ప్రేమకథ.. ఎంగేజ్‌మెంట్ వరకు.. జాన్వీ సోదరి

Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో మొదలైన ప్రేమకథ.. ఎంగేజ్‌మెంట్ వరకు.. జాన్వీ సోదరి

Anshula Kapoor: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురు, జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ (Anshula Kapoor) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన రోహన్ తక్కర్ అనే యువకుడితో ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె చేతికి ఉంగరం తొడుగుతున్న రోహన్ ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగపూరితంగా ఒక నోట్ రాసింది.

“మూడు సంవత్సరాల క్రితం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో అర్ధరాత్రి 1.15కి అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆ రాత్రంతా మాట్లాడుకున్నాము. అప్పుడు నా జీవితంలో ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది. అప్పటినుంచి ఈ ప్రయాణం నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. అతడి పక్కన ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతడే నా బెస్ట్ ఫ్రెండ్‌” అని అన్షులా తెలిపింది.

ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అన్షులా అన్న, నటుడు అర్జున్ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. “మీరిద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలి. ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మమ్మీని చాలా మిస్సవుతున్నా” అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌ కూడా “మా సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందోచ్‌!” అంటూ కామెంట్లు చేశారు.

రోహన్ తక్కర్ ఒక స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు.

ఇక బోనీ కపూర్ వ్యక్తిగత జీవితం వైపు చూస్తే, ఆయన మొదటి భార్య మోనా శౌరీ కపూర్ కూడా నిర్మాతగానే పేరు తెచ్చుకుంది. 1983లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని, అర్జున్, అన్షులా అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే 1996లో బోనీ మోనాతో విడిపోయి అదే సంవత్సరం శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవికి జాన్వీ, ఖుషి కపూర్ అనే కుమార్తెలు. మోనా 2012లో మరణించగా, శ్రీదేవి 2018లో కన్నుమూసింది. అయినా కూడా అర్జున్, అన్షులా తమ సవతి సోదరీమణులైన జాన్వీ, ఖుషిలతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు.

ఇవీ చదవండి: Cannes Film Festival 2025 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్ సందడి
Janhvi kapoor hot: జాన్వీ కపూర్‌లో ఈ ట్యాలెంట్ ఉందని మీకు తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు