శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

Jamili Elections: 2026లోనే కొత్త నియోజకవర్గాలు.. 2027లో జమిలి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 12 అక్టోబర్ 2024

Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ టర్మ్ లోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు 2029లో జరగాలి. కానీ 2027 ద్వితీయార్థంలోనే జరుగతాయన్న ఊహాగానాలు వస్తున్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జమిలి ఎన్నికలకు వెళ్లే చాన్స్ కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తాజాగా ఓ ప్రకటన చేశారు. జమిలి ఎన్నికల గురించి తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, ఐదేళ్లలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగించే బదులు సాధారణ ఎన్నికలు దేశంలో ఒకేసారి జరగడం మంచిదన్నది తన అభిప్రాయమన్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు చంద్రబాబు. అందుకు అనుగుణంగానే ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి.

సాధారణంగా ప్రభుత్వం మారగానే ఆరు నెలలో లేదా ఏడాదో కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వడం పరిపాటి. కానీ ఏపీలో ఇటు ప్రభుత్వం మారగానే కూటమి సర్కార్ పై మాజీ సీఎం జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఎండగడుతున్నారు. మాజీ సీఎం జగన్ ఓడిన మరుక్షణం నుంచే పార్టీ పటిష్టతపై ఫోకస్ పెంచారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అభిమానులతో రోజూ ఫొటోలు దిగుతున్నారు. బెంగళూరుకు వెళ్లి అక్కడ ప్రణాళికలు రచిస్తున్నారు.

జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడంతో పాటు దిశానిర్దేశం చేస్తూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తిరిగి పుంజుకునేలా ఆదేశాలిస్తున్నారు. కార్పొరేటర్లు చేజారకుండా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీగా గెలిపించుకుని మండలికి ప్రతిపక్ష నేతగా చేశారు. ముందస్తు ఎన్నికలు లేదా జమిలి ఎన్నికల సమాచారం లేనిదే జగన్ ఈ రకంగా దూకుడు ప్రదర్శించరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ఈసారి కాస్త దూకుడు పెంచారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై, తనకు వ్యతిరేకంగా వచ్చే వారిపై ఫోకస్ పెంచారు. ఎక్కడిక్కడ అణచివేతలు, పోలీసు కేసులు పెట్టిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. అధికారం చేతులు మారిన నేపథ్యంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై హత్యలు, దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, శిలాఫలకాలు, సచివాలయాల బోర్డుల విధ్వంసం.. రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై మాజీ సీఎం జగన్ ఢిల్లీలో నిరసన ప్రదర్శన కూడా చేశారు. కోర్టుల్లో కేసులు కూడా వేసి పోరాడుతున్నారు.

మరోవైపు ఎన్నికల ముంగిట ఇచ్చినహామీలు నెరవేర్చకపోవడంపై ఎలా ముందుకెళ్లాలి, ఏ విధంగా వైయస్సార్ సీపీ విమర్శలను తిప్పి కొట్టాలన్న దానిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఎన్ని విమర్శలొచ్చినా డిఫెండ్ చేసుకుంటూ మంత్రుల చేత మాట్లాడిస్తున్నారు. వారి చేత కాకపోతే స్వయంగా చంద్రబాబే ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి చీటికీ మాటికీ ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధం. మీడియా కనపడితే చాలు, మైకు కనపడితే చాలు, మాట్లాడేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని మోదీ సపోర్టుతో మరోసారి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు పట్టుదలగా ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తూ మాట్లాడుతున్నారు. అలాగే జమిలి ఎన్నికలపై కూడా తన స్టాండ్ చెప్పారు చంద్రబాబు.

జమిలి ఎన్నికలపై ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఓ నివేదికను సమర్పించింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రం కార్యారణ రెడీ చేస్తోంది.

దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు పెరుగుతున్న క్రమంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని మరోవైపు కాంగ్రెస్, దేశంలోని చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారా? లేక ఈవీఎంల ద్వారానే వెళ్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. జమిలి ఎన్నికలు జరిగితే నిజంగా లాభపడేదెవరు? ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారా? ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని మోదీ సహకారంతో మరోసారి చంద్రబాబు చక్రం తిప్పుతారా? లేదా మూడు పార్టీల కూటమి విడిపోయి మళ్లీ జగన్ ను గెలిపించే దిశగా వెళ్లారా? చంద్రబాబు అభివృద్ధి మంత్రాన్ని జనం నమ్ముతారా? జగన్ చేసిన సంక్షేమమే మేలని అటువైపు జనం వెళ్తారా? వేచి చూడాల్సిందే.

Read also: Semi Jamili: సెమీ జమిలికి సై.. 13 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?
Modi on Jamili Elections: ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ.. జమిలి ఎన్నికలపై కీలక అడుగులు?
PM Modi in Anakapalli: ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా నడుస్తోంది: అనకాపల్లిలో ప్రధాని మోదీ
PM Modi in Vemagiri: చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నంబర్‌ వన్: ప్రధాని మోదీ
CBN Comments on Modi: అబ్బబ్బ.. అవేం పొగడ్తలు.. తిట్టిన నోటితోనే ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం!!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading