Green Tomato: వంటింట్లో నిత్యం లభించేవి కూరగాయలు. వాటిలో ముఖ్యమైనది టమాటా. దాదాపు అన్ని కూరల్లోనూ టమాటా విరివిగా వినియోగిస్తారు. టమాటా (Green Tomato) లేనిదే ఏ కూర అయినా అసంపూర్తిగా ఉంటుందని చెబుతారు. ఇంట్లో వండే వంటలకైనా, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనైనా టమాటా ఉండి తీరాల్సిందే. అయితే, ఎక్కువ మంది టమాటాలు కాస్త ఎరుపు రంగులోకి వచ్చాక వినియోగిస్తుంటారు.
పచ్చి టమాటాలో విటమిన్ ఏ, సీ, కాల్షియం, పొటాషియం తదితరాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరేలా చేస్తాయి. పచ్చి టమాటా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి టమాటాలను క్రమం తప్పకుండా తింటే శరీరానికి విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం రాకుండా రక్షణ ఇస్తుంది.
పచ్చి టమాటాలను (Green Tomato) ఎప్పుడైనా తిని చూశారా? ఇదేం ప్రశ్న.. గ్రీన్ కలర్‌లో ఉండే టమాటాలను ఎలా తింటారు.. కాస్త ఎరుపు రంగులోకి మారాక వంటలకైనా, లేదా సాస్‌కు అయినా వినియోగిస్తుంటారు కదా.. అని సమాధానం వస్తుంది. అయితే పచ్చి టమాటాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి టమాటాలు తినడం వల్ల అనేక లాభాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.
కళ్ల ఆరోగ్యం కోసం గ్రీన్ టమాటాలను రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. దీని వల్ల కంటి పనితీరు సక్రమంగా జరుగుతుంది. కంటి చూపు పెరుగుతుంది. దాంతోపాటు రక్తపోటును నియంత్రించే శక్తి పచ్చి టమాటాలకు ఉందని చెబుతున్నారు.
విటమిన్ సీ, ఫాస్పరస్ పుష్కలం..
ఎసిడిటీ టమాటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. దీంతో ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహ రోగులకు టమాటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమాటాలు ఎంతో ఉపయుక్తంగా పని చేస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా తీసుకోవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. కంటి జబ్బులకు కూడా టమాటా బెస్ట్‌మెడిసిన్. టమాటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమాటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి సైతం కుదుటపడుతుంది. నిరంతరం టమాటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గిపోతుంది.
టమాటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో దోహదపడుతుంది. వారానికి పదిసార్లు టమాటాలు తీసుకుంటే ప్రోస్టేట్, మలద్వార, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
Read Also : Rose Water: రోజ్ వాటర్‌తో ప్రయోజనాలు ఇవీ.. రోజూ తాగండి!