Rose Water: రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల చర్మ సౌందర్యం కూడా మీ సొంతమవుతుంది. అయితే, రోజ్ వాటర్‌ను కూడా తరచూ చాలా మంది వాడుతుంటారు. రోజ్ వాటర్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడే వారు రోజూ రోజ్ వాటర్ (Rose Water) తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పువ్వులో ఉండే సుగుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి తోడ్పతాయి.
సాధారణంగా రోజూ మన శరీరానికి తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవలని వైద్యులు చెబుతారు. అయితే చాలా మంది కనీసం రెండు లీటర్లయినా తీసుకోరు. తగినంత నీరు తీసుకోని వారికి శరీరంలో తిన్న పదార్థాలు జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నీరు బాగా తాగడం వల్ల శరీరం కాంతివంతమవుతుంది. కిడ్నీలు రాళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
రోజ్ వాటర్‌ను (Rose Water) తీసుకోవడం వల్ల ఇందులో ఉండే గుణాలు వంటకాల రుచిని మరింత పెంచుతాయని చెబుతారు. ఇది వంటకాల్లో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీంతో వంటకాల్లో రోజ్ వాటర్‌ను వినియోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవని చెబుతున్నారు. రోజ్ వాటర్ వల్ల కాలేయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజ్ వాటర్ తీసుకోవడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరగటం వల్ల నేటి రోజుల్లో చాలా మందికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. రోజ్ వాటర్ ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదం చేస్తుందని నిపుణులంటున్నారు. ఒక కప్పులో రెండు చెంచాల రోజ్ వాటర్ తీసుకొని, అందులో దూదిని ముంచి కళ్ల కింద మెత్తగా పూసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేయడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు ఇలా చేయడం వల్ల కళ్ల మంట కూడా తగ్గుతుంది.
సూర్య కిరణాల నుంచి రక్షణ
రోజ్ వాటర్‌లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండలోకి వెళ్లే ముందు రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే మంచిది. రోజ్ వాటర్ ను రోజూ ముఖానికి స్ప్రే చేయడం ద్వారా చర్మం క్లీన్ గా మారి చెమట గ్రంథులు కూడా తెరుచుకుంటాయి. ఇది మీకు తాజా అనుభూతిని ఇస్తుంది.
ప్రస్తుతం గజిబిజి జీవన శైలి కారణంగా చాలా మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే రోజ్ వాటర్‌ను రోజూ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజ్ వాటర్‌లో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగామేలు చేస్తాయంటున్నారు. అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడి తగ్గించడంలో రోజ్ వాటర్‌ది కీలక పాత్ర. రోజ్ వాటర్ తాగడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. జీర్ణక్రియను బలంగా చేయడానికి రోజ్ వాటర్ ఉపయోగడపతుంది.
Read Also : Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!