Agriculture: రూ.43,402 కోట్లతో ఏపీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంబంధిత శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో అగ్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు. అగ్రి బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవీ..
అగ్రి బడ్జెట్ మొత్తం రూ.43,402 కోట్లు
– భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
– విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
– ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
– పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
– ప్రకృతి వ్యవసాయం రూ.422.96 కోట్లు
– డిజిటల్ వ్యవసాయం రూ.44.77 కోట్లు
– వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు
– వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు
– అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు
– రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
– ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
– పంటల బీమాకు రూ.1,023 కోట్లు
– వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
– ఉద్యాన శాఖకు రూ.3,469.47 కోట్లు
– పట్టు పరిశ్రమకు రూ.108.4429 కోట్లు
– వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
– సహకార శాఖ రూ.308.26 కోట్లు
గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది: అచ్చెన్నాయుడు
– గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది
– గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదు
– మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది
– ఇటీవల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచాం
– స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం
– రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటింది
– 62శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారం
– పెట్టుబడి సాయం పెంచి, నెలరోజుల్లోనే అందించాం
– రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం
– వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం
– భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నాం
– భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తాం
– మట్టి నమూనాల కోసం ల్యాబ్ లు, సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం
– గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం
– రైతులను ఆధునిక వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తాం
– 4.03 మెట్రిక్ టన్నుల ఎరువులు మార్కెఫెడ్ ద్వారా పంపిణీ
– రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల పంపిణీ
– సమీకృత రైతు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
– పాడిపంటలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తాం
– బంజరు భూములను సాగులోకి తీసుకొస్తాం
– రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వబోతున్నాం
– రైతు సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు
దేవదాయశాఖ కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
– 6 వేల దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
– అర్చకుల వేతనం రూ.10 నుంచి రూ.15 వేలకు పెంపు
– వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి
– కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతుల పునరుద్ధరణ
– 160 దేవాలయాల ఆధునీకరణ పనులకు రూ.113 కోట్లు
ఇవీ చదవండి: AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్
CM Review on Agriculture: అన్ని విధాలా ఆదుకుంటున్నాం.. వ్యవసాయంపై సమీక్షలో సీఎం జగన్
Right to Abortion: ఆ దేశంలో అబార్షన్ హక్కు.. రాజ్యాంగంలో మార్పులు!
Skoch Award: స్కోచ్ అవార్డు 2023 కైవసం చేసుకున్న ఏపీ వ్యవసాయ శాఖ
