HomeAndhra PradeshAP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్

AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్

AP Budget 2024: ఏపీలో కూటమి ప్రభుత్వం 5 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను (AP Budget 2024) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలన్న పయ్యావుల.. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆయన.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసిందని, తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇవీ..

2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్..
– రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
– మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
– రెవెన్యూ లోటు రూ.34, 743 కోట్లు
– ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
– జీఎస్ డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం
– జీఎస్ డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12శాతం

ఉన్నత విద్య: రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం: రూ.18,421 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.16,739కోట్లు
పట్టణాభివృద్ధి: రూ.11,490కోట్లు
గృహనిర్మాణ:: రూ.4,012 కోట్లు
జలవనరులు: రూ.16705కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం: రూ.3,127కోట్లు
ఇంధనరంగం: రూ.8,207కోట్లు
రోడ్లు భవనాలు: రూ.9,554కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ: రూ.322కోట్లు
పోలీసు శాఖ: రూ.8,495కోట్లు
పర్యావరణం, అటవీశాఖ: రూ.687కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ.18,497కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.39,007కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ.4,376 కోట్లు
మహిళ శిశుసంక్షేమం: రూ.4,285కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,215కోట్లు
పాఠశాల విద్యాశాఖ: రూ.29,909కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం: రూ.4,376 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు: రూ.11,855కోట్లు

అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు:
– రాష్ట్ర ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు
– ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం ఓ ఉదాహారణ
– గత ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలు అనుసరించింది
– గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం
– గత సర్కారు రాబోయే 25ఏళ్ల ఆదాయాన్ని తగ్గించింది
– రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేశారు
– గత ప్రభుత్వంలో పరిమితికి మించి అప్పులు చేశారు
– రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది..

– గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారుః
– 2019 నుంచి 2025 వరకు రాష్ట్రం తిరోగమన దిశలో వెళ్లింది
– రాష్ట్ర బ్రాండ్ విలువను గత ప్రభుత్వం దెబ్బతీసింది
– రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా చేశారు
– పోలవరం ప్రాజెక్టు నిలిపివేసింది, డయాఫ్రం వాల్ ను దెబ్బతీసింది
– అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి
– గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేసింది

– కేంద్ర పథకాలను దారిమళ్లించారు..కార్పొరేషన్ల నిధులను కూడా మళ్లించారు
– అనేక బిల్లులు చెల్లింపులు ఆపేయడంతో కాంట్రాక్టర్లు దెబ్బతిన్నారు
– రూ.10లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది
– గత ప్రభుత్వాన్ని ఓ ప్రైవేటు సంస్థలా నడిచింది
– వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నడిపించారు

– ముఖ్యమైన పథకాలకూ చెల్లింపులు చేయలేదు
– ప్రాజెక్టులన్నింటినీ స్తంభింపజేశారు
– రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు
– బడ్జెట్ అంటే..అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉంది
– రాష్ట్రాన్ని కాపాడాలని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
– 93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది.

బడ్జెట్ ప్రసంగం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..

AP BUDGET_24_25 ( TELUGU)_rotated

ఇవీ చదవండి: Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!
Telangana Budget: కొత్త ప్రభుత్వంలో రూ.2,75,897 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
Andhra Pradesh: సూపర్ సిక్స్ అంటే భయమా? ముందే చెప్పాలి కదా సార్?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు