HomeLife StyleHiking : వర్షాకాలంలో హైకింగ్‌తో నూతనోత్తేజం.. ఎలా చేయాలంటే..

Hiking : వర్షాకాలంలో హైకింగ్‌తో నూతనోత్తేజం.. ఎలా చేయాలంటే..

Hiking : రెయినీ సీజన్ లో చినుకు పడితే ప్రకృతి పులకరించిపోతుంది. పచ్చదనంతో పరవశించిపోతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో వీనులవిందుగా మారుతుంది. ఈ సమయంలో బయట గాలికి తిరగడం, హైకింగ్ వంటివి చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

తరచూ ఉండే పనుల నుంచి కాస్త రెస్ట్ తీసుకోవడం కోసం ఇటువంటి సాహసాలు చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రకృతి నుంచి వచ్చే ఆహ్లాదకరమైన గాలి, సువాసనతో మనసును హాయిగా సేదతీరవచ్చు.

గుండె ఆరోగ్యం పదిలం
హైకింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. శరీర సామర్థ్యత, సమతుల్యతను పెంచడానికి తోడ్పడుతుంది. హృదయ స్పందన రేటును పెంచడమే కాకుండా, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. హైకింగ్ చేసే వారికి గుండెపోటు వంటి గుండె సంబంధింత సమస్యలలు రావడం చాలా తక్కువ అని అంటున్నారు.

ప్రకృతితో అనుబంధం
ప్రకృతిలో ఉండే దృశ్యాలను చూడడానికి హైకింగ్ వంటివి మంచి అనుభవాలుగా మిగులుతాయి. హిమాలయాలు, కొండప్రాంతాల్లో చేసే ఈ హైకింగ్ వల్ల సలహమైన ప్రకృతి అందాలు చూసి మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది. అంతేకాదు ఇలాంటి సాహసాలు శరీరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్ ఏర్పరుస్తుంది. కొండ ప్రాంతాలపైకి ఎక్కడం వల్ల కలిగే అనుభూతితో మానసికంగా ఏర్పడే సంతోషంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఈ హైకింగ్ చేసే వారిలో చాలా రకాల మానసిక ఆరోగ్యాలు నయమైనట్లు నిపుణులు చెబుతున్నారు. మానసికంగా సంతోషంగా ఉండేవారు శారీరకంగా ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశాలు కూడా తక్కువే అని అంటున్నారు. తరచూ ఆఫీసుల్లో పని ఒత్తిడికి లోనయ్యే వారు ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని పర్యటనలకు వెళ్లడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మానసిక స్థితి మెరుగు
హైకింగ్ మెంటల్ కండిషన్, భావోద్వేగ శ్రేయస్సుపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ, సాధారణంగా, ఎండార్ఫిన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. హైకింగ్ చేస్తున్న టైమ్ లో సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్-D ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మానసిక స్థితి నియంత్రణకు కీలకం అని తెలిసిందే. శారీరకంగా అలసిపోయినా కూడా మానసికంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Stress: ఒత్తిడిని జయించడానికి కొత్త మార్గాలు.. వ్యాయామం, యోగాతో పాటు ఇవీ కూడా..!
Exercise: వ్యాయామం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఏరోబిక్‌తో హెల్తీ లైఫ్‌
Sugar patients: చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
Adudham Andhra CM Jagan: ఏటా ఆడుదాం ఆంధ్ర క్రీడలు.. గ్రామస్థాయిలోనే వ్యాయామంపై అవగాహన ఉండాలన్న సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు