Mint Cinnamon Tea: ఈ రోజుల్లో చిన్న వయసులోనే డయాబెటిస్ సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించుకోవడానికి చాలామంది ఆహారం, వ్యాయామంతో పాటు పలు ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పుదీనా ఆకులు, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ గురించి సోషల్ మీడియాలో అనేక ఆరోగ్య ప్రయోజనాల ప్రచారం జరుగుతోంది. పుదీనా-దాల్చిన చెక్క టీ జీర్ణక్రియకు ఆహ్లాదకరమైన పానీయంగా ఉండొచ్చు. అయితే ఈ టీ తాగితే డయాబెటిస్ పూర్తిగా తగ్గిపోతుంది లేదా మందులు అవసరం ఉండదు అనే ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కూడా దాల్చిన చెక్క వంటి హెర్బ్స్ లేదా స్పైసులను రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కోసం నిర్ధారిత చికిత్సగా సిఫారసు చేయడం లేదు.
Mint Cinnamon Tea: పుదీనా-దాల్చిన చెక్క టీతో షుగర్ కంట్రోల్ అవుతుందా? జీర్ణక్రియకు ఉపయోగమా? నిజాలు ఇవే
RELATED ARTICLES
