శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Telangana

Foxconn: ఫాక్స్‌కాన్ ను సందర్శించిన సీఎం రేవంత్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 15 అక్టోబర్ 2024

Foxconn: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ (Foxconn) కంపెనీని సందర్శించారు.

ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై FIT KK Park (Foxconn Interconnect Technology Kongara Kalan Park) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.

కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు Foxconn ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి
CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
CM Revanth Reddy: రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాలి
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading