HomeAndhra PradeshAnchor Syamala: వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. ట్రోలింగ్ శ్యామల ఫైర్

Anchor Syamala: వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. ట్రోలింగ్ శ్యామల ఫైర్

Anchor Syamala: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని యాంకర్, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా నేరాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాలుగు నెలల్లో ఒక్క నిందితుడిని కూడా కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవని ఆమె గుర్తు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలు, చివరకు హోం మంత్రి నియోజకవర్గంలో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదని ఆక్షేపించారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు దుర్గాడ జానీ, బాలికను అపహరించి అఘాయిత్యం చేస్తే.. బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చేదాకా పోలీసులు కేసు నమోదు చేయలేదని శ్యామల తెలిపారు. చివరకు పోలీస్‌ కుటుంబాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్న ఆమె, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్‌ చేసి దారుణంగా హతమార్చిన ఘటనను ప్రస్తావించారు.

పుంగనూరులోనూ బాలిక కనిపించడం లేదని, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు కేసును సీరియస్‌గా హ్యాండిల్‌ చేసి ఉంటే, ఆ బాలిక ప్రాణాలతో దక్కేదని, ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలేది కాదని చెప్పారు. చివరకు జగన్‌ పుంగనూరు వెళ్తానని ప్రకటించడంతో, అప్పటికప్పుడు ముగ్గురు మంత్రులు అక్కడకు వెళ్లి, బాధిత కుటుంబాన్ని కలిశారని శ్యామల గుర్తు చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో దారుణహత్యకు గురైన బాలిక మృతదేహాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోయారని ఆక్షేపించారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ తీసుకొచ్చిన దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు.. ఆ వ్యవస్థ ఇప్పుడు ఉండి ఉంటే, ఇన్ని నేరాలు జరిగేవా? అని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో హిడెన్‌ కెమెరాలపై దాదాపు 300 మంది విద్యార్థినులు ఆందోళన చేస్తే, అక్కడ కెమెరాలే లేవని మంత్రి నారా లోకేష్‌ దబాయించిన విషయాన్ని శ్యామల గుర్తు చేశారు. అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుంటే, నిందితులు.. తామేం చేసినా ఏమీ కాదనే ధీమాతో ఉన్నారని, అందుకే ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా ప్రకటించిన నాటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని, టీడీపీ గ్రూపుల్లో, ఆ పార్టీ ట్విటర్‌ హ్యాండిల్స్‌లో, లోకేష్‌ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ నుంచి దారుణమైన పదజాలంతో చెప్పనలవికాని భాషతో తిట్టడమే కాకుండా తన నెంబర్‌ను పోస్ట్‌ చేశారని శ్యామల వెల్లడించారు. తనకు రోజుకు 900కు పైగా ఫోన్‌ కాల్స్, వేల సంఖ్యలో మెసేజ్‌లు పెట్టి అతి హేయంగా వేధిస్తున్నారంటూ.. వాటన్నింటినీ ఆమె పీపీటీలో చూపారు.

సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకుండా చేశారని, అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, బాధితుల పక్షాన తట్టుకుని నిలబడతానని శ్యామల స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి చెందిన మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు.. ఒక వేళ వస్తే తమ పార్టీ (టీడీపీ)లోనే ఉండాలి తప్ప, మరే పార్టీలో ఉండకూడదన్న వైఖరితో ఎంతకైనా తెగించి దూషిస్తున్నారని ఆమె వివరించారు.

లోకేశ్‌ తన రెడ్‌ బుక్‌లో ఏం రాసుకున్నాడో తెలియదు కానీ.. ప్రజలు, దేవుడు.. ఈ కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న దారుణాలు, జరుగుతున్న దాడులు, అరాచకాలను రాసుకుంటున్నారని, వాటన్నింటికీ అధికారపక్షం వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదని శ్యామల తేల్చి చెప్పారు. తమను ఎంతగా వేధించినా, ఎన్ని విధాలుగా అడ్డుకున్నా బాధితుల పక్షాన పోరాడతామని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమించి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళాశక్తిని చాటుతామని శ్యామల స్పష్టం చేశారు.

Read also: Varudu Kalyani: పోలీస్‌ ఫ్యామిలీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?
Varudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు
Peddi Reddy: చిన్నారి అంజుమ్ హత్య అత్యంత దారుణం: పెద్దిరెడ్డి
Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు