శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 6 అక్టోబర్ 2024

Kurasala Kannababu: తెలుగుదేశం పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ అని, ప్రజా సమస్యలను పూర్తిగా వదిలేసిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఏ దిశలో నడుపుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) తెలిపారు. 100 రోజుల పాలనలో అన్నింటా విఫలమైన ప్రభుత్వం, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, టీటీడీ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కల్తీనెయ్యి ఆరోపణల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు కానున్న ‘సిట్‌’ నిష్పాక్షిక విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల కన్నబాబు కోరారు.

రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన కన్నబాబు, ఇప్పుడు టీటీడీలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అక్షేపించారు. తిరుమలలో గోవింద నామస్మరణ బదులు చంద్రబాబు స్మరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంతో లబ్ధి పొందాలనే ఆతృత తప్ప, వారికి స్వామివారిపై భక్తి లేదని తేల్చి చెప్పారు. లడ్డూ వివాదంలో జగన్‌ను కించపరుస్తున్నామని అనుకుంటూ, శ్రీ వెంకటేశ్వరస్వామివారిని, టీటీడీ విశిష్టతను దెబ్బ తీస్తున్నారన్న ఆయన, ఇంకా ఎంత కాలం కట్టుకథలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని, సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున, ఇకనైనా చవకబారు విమర్శలు మానాలని హితవు చెప్పారు.

ఇటీవల జిల్లాలో సంభవించిన వరదలకు వేలాది కుటుంబాలు నష్టపోయి, లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బ తిన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయన్న కన్నబాబు.. కొన్నింటి ధరలు ప్రస్తావించారు.
కిలో ఉల్లి రైతు బజారులో రూ.60కి పైనే ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.75కు పైగా పలుకుతోందని, 25 కేజీల బియ్యం ధర రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా «నిత్యాసరాల ధరలు పెరిగితే, ధరల స్థిరీకరణ నిధి నుంచి ఖర్చు చేసి తక్కువ ధరకు వినియోగదార్లకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుకపై నానా రభస చేసిన టీడీపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దోపిడి వల్ల రాష్ట్రంలో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడిందని మాజీ మంత్రి తెలిపారు. మరోవైపు రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేసి, ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన వెల్లడించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఒక ఇసుక రసీదును ప్రస్తావించిన ఆయన, రవాణా ఖర్చు రూ.9276తో పాటు, మొత్తం ఇసుక ధరను రూ.16,640గా చూపారని చెప్పారు. అంత మొత్తాన్ని అదనంగా ఎందుకు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ట్రక్కు ఇసుక రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు దొరకగా, ఇవాళ రూ.30 వేలకు తక్కువ లేదని, విశాఖలో ఏకంగా రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్న కన్నబాబు, దాదాపు 15 లక్షల ఎకరాల్లో సాగు లేదని, మరో 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సరే సరిగా లెక్కలు వేయడం లేదని ఆక్షేపించారు. ముస్లిం కుటుంబానికి చెందిన బాలిక పుంగనూరులో శవమై తేలితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మాజీ మంత్రి గుర్తు చేశారు.

ఇవీ చదవండి: Varudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు
YS Jagan in Anakapalli: విలన్లకు హీరోలు బచ్చాగాళ్లలా కనిపిస్తారు.. నీకూ అంతేనయ్యా చంద్రబాబూ!
YS Jagan in Kakinada: పథకాలన్నీ కొనసాగాలా? బాబు మార్క్ మోసాలతో ముగిసిపోవాలా?
YS Sharmila: సెక్యులర్ పార్టీ రైటిస్ట్ పార్టీ అయ్యింది.. పవన్‌పై వైయస్ షర్మిల ఫైర్
Srinivasa Varma: గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి: కేంద్ర మంత్రి

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading